BiggBoss 6 Day 91 : బిగ్‌బాస్‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా??
బిగ్‌బాస్ సీజన్ 6 సాగుతూ చివరికి వచ్చేసింది. 21 మందితో మొదలైన బిగ్‌బాస్ ఒక్కొక్కరిని పంపించేస్తూ ఈ వారం కూడా ఒకర్ని ఎలిమినేట్ చేసేశాడు. సన్ డే వీకెండ్ ఎపిసోడ్ లో ఎప్పటిలాగే ఫన్ తో పాటు ఎలిమినేషన్...............

BiggBoss 6 Day 91 : బిగ్‌బాస్ సీజన్ 6 సాగుతూ చివరికి వచ్చేసింది. 21 మందితో మొదలైన బిగ్‌బాస్ ఒక్కొక్కరిని పంపించేస్తూ ఈ వారం కూడా ఒకర్ని ఎలిమినేట్ చేసేశాడు. సన్ డే వీకెండ్ ఎపిసోడ్ లో ఎప్పటిలాగే ఫన్ తో పాటు ఎలిమినేషన్ కూడా చేశాడు బిగ్‌బాస్. మొదట కంటెస్టెంట్స్ అందరిని హౌస్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో జీవితాంతం ఫ్రెండ్ గా ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఎవరు అసలు ఫ్రెండ్ గా వద్దనుకుంటున్నారో చెప్పమన్నాడు నాగార్జున.
దీనికి ఆది రెడ్డి.. ఫైమాను ఫ్రెండ్ అని, ఇనయతో ఫ్రెండ్‌షిప్ ఉండదని చెప్పాడు.
ఇనయా.. కీర్తిని ఫ్రెండ్‌గా, శ్రీహాన్‌తో ఫ్రెండ్‌షిప్ కష్టమే అని చెప్పింది.
శ్రీహాన్.. రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డిని కలిసే ఛాన్స్ ఉండదని చెప్పాడు.
రోహిత్.. రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమో అన్నాడు.
ఫైమా.. ఆదిరెడ్డి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని, రోహిత్‌తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది.
కీర్తి.. ఇనయా ఫ్రెండ్, శ్రీహాన్ ఫ్రెండ్ కాదు అని చెప్పింది.
రేవంత్.. శ్రీసత్యతో ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తానని, కీర్తి అసలు అర్ధం చేసుకోదు అని చెప్పాడు.
శ్రీసత్య.. రేవంత్‌తోనే క్లోజ్ అయ్యాను అని, రోహిత్ తో కనెక్షన్ తక్కువ అని చెప్పింది.
అనంతరం హిట్ 2 టీం అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను బిగ్‌బాస్ లోకి వచ్చి సందడి చేశారు. కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించారు. అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవ్వగా నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చి చివరికి ఫైమాని ఎలిమినేట్ చేశాడు నాగార్జున. దీంతో ఫైమా ఎమోషనల్ అవుతూ బయటకి వచ్చేసింది.
ఫైమా స్టేజిమీదకి వచ్చిన తర్వాత ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరితో ఫన్? ఎవరితో ఫ్రస్టేషన్? ఉంటుంది అని నాగార్జున అడిగాడు. దీనికి ఫైమా.. ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయా, రోహిత్‌లు ఫన్ కేటగిరిలో ఉంటారని, రేవంత్ మాత్రం ఫ్రస్టేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పింది. అనంతరం వెళ్లేముందు ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఫైమా చేతికి కిస్ ఇచ్చాడు. ఫైమా వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు.