BiggBoss Lahari : ఫోక్ సాంగ్ తో అదరగొడుతున్న బిగ్ బాస్ లహరి
అర్జున్ రెడ్డి సినిమాలో చిన్న క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్న లహరి తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అవి అనుకున్నంత గుర్తింపు రాలేదు. తాజాగా బిగ్ బాస్ ఆఫర్ రావడ

Lahari
BiggBoss Lahari : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ షోలో పాల్గొనడంతో అప్పటిదాకా కొద్దో గొప్ప పేరున్న వాళ్ళు షో నుంచి బయటకి వచ్చాక ఫేమస్ అయిపోయారు. ఈ షోతో రాత్రికి రాత్రే స్టార్స్‌గా మారిన వాళ్లు కూడా ఉన్నారు. కెరీర్ లో డల్ గా ఉన్నవాళ్ళకి ఈ షో బాగా ప్లస్ అయింది. ఈ షో నుంచి బయటకి వచ్చాక ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5 లో పార్టిసిపేట్ చేసిన లహరి కి హౌస్ నుంచి బయటకు వచ్చాక బాగానే ఆఫర్లు వస్తున్నాయి.
MAA Election 2021 : పెద్దగా ఉండాలని అన్నయ్య అనుకోలేదు..ఆయనకు అహంకారం లేదు
అర్జున్ రెడ్డి సినిమాలో చిన్న క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్న లహరి తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అవి అనుకున్నంత గుర్తింపు రాలేదు. తాజాగా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఈ ఆఫర్ ని బాగానే ఉపయోగించుకుంది. తొందరగా ఎలిమినేట్ అయిపోయినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది. తాజాగా ఓ ఫోక్ సాంగ్ తో జనాల్లోకి వచ్చింది లహరి. ఈ సాంగ్ కోసం డీ గ్లామరస్ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘ఒద్దన్నా గుండెల్లో సేరి’ అనే పాటతో అలరించబోతుంది. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. సాంగ్ కోసం లహరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ క్రేజ్ ని ఉపయోగించుకొని ఫామ్ లోకి రావడానికి గట్టిగానే ప్లాన్ వేస్తుంది లహరి.