MAA Election 2021 : పెద్దగా ఉండాలని అన్నయ్య అనుకోలేదు..ఆయనకు అహంకారం లేదు

పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య ఎప్పుడు అనుకోలేదని నటుడు నాగబాబు వెల్లడించారు. ఆయనకు అంత అహంకారం లేదని కష్టమంటూ..ఇంటికి వస్తే..చేతనైంత సహాయం చేశారని తెలిపారు.

MAA Election 2021 : పెద్దగా ఉండాలని అన్నయ్య అనుకోలేదు..ఆయనకు అహంకారం లేదు

Maa

Nagababu Comments : సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య (మెగాస్టార్ చిరంజీవి) ఎప్పుడు అనుకోలేదు..చేతనైంత సహాయం చేయాలని చూస్తారే కానీ…‘పెదరాయుడు’లాగా..సింహాసనంపై కూర్చొని…పెద్దరికం చలాయిస్తారని ఎప్పుడూ అనలేదు..అంటూ మెగా బ్రదర్, నటుడు నాగబాబు వెల్లడించారు. మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోసారి మా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారాయన. మా అసోసియేషన్ ఎన్నికలు జరిగిపోయాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై గెలిచారు.

Read More : MAA Elections: “మా” ఎన్నికల తుది ఫలితాలు విడుదల

ఎన్నికల వాతావరణం అయిపోయినా కూడా..ఇంకా ఆ వేడి మాత్రం తగ్గలేదు. మాది సినిమా కుటుంబం…అందరం ఒక్కటే అని చెప్పుకొంటూనే…ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మంచు విష్ణు గెలవగానే…రాజీనామా పర్వం తెరలేచింది. తాను అసోసియేషన్ సభ్యుడిగా కొనసాగాలని అనుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు నాగబాబు. సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతాయో..అలాగే..ఇక్కడ జరిగాయని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన పరిణామాలను ఆయన వివరించారు.

Read More : MAA Election: సభ్యత్వానికి రాజీనామా.. ‘మా’లో ఎందుకింత వైరాగ్యం

ప్రాంతీయ వాదం, కులంతో పాటు ప్రకాష్ రాజ్ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకొచ్చారని, ఇబ్బంది కలిగేలా ప్రత్యర్థి ప్యానల్ సభ్యులు కామెంట్ చేసిన క్రమంలో…అతనికి సపోర్టుగా తాను వారికి కౌంటర్ ఇవ్వడం జరిగిందన్నారు. తెలుగు వాళ్లకు ప్రాంతీయ వాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారని అనుకుంటే..వేరే విధంగా ఉందన్నారు. ఎన్నికల అనంతరం ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్ లో ఉండాలని అనిపించలేదని, మనస్థాపంతో తాను బయటకు వచ్చేసినట్లు తెలిపారు. అన్యయ్య చిరంజీవి..ఎప్పుడూ పెద్దగా ఉండాలని అనుకోలేదని, పరిశ్రమలో ఉన్న వారు, ఇతరులు, అభిమానులు ఎవరైనా కష్టమంటూ..ఇంటికి వస్తే..చేతనైంత సాయం చేయడం జరిగిందన్నారు. ఆయనకు అంత అహంకారం లేదన్నారు నాగబాబు.