సీన్ తీయకపోతే థియేటర్లు తగలబడతాయ్.. రాజమౌళి, ఎన్టీఆర్‌‌లకు ఎంపీ వార్నింగ్..

  • Published By: sekhar ,Published On : October 27, 2020 / 03:31 PM IST
సీన్ తీయకపోతే థియేటర్లు తగలబడతాయ్.. రాజమౌళి, ఎన్టీఆర్‌‌లకు ఎంపీ వార్నింగ్..

Updated On : November 1, 2020 / 4:42 PM IST

RRR – Bheem Intro Teaser : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. వివరాళ్లోకి వెళ్తే.. ఈ నెల 22న కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో భీం క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. టీజర్ చివర్లో భీమ్ టకియాను ధరించి కనబడడం వివాదాస్పదంగా మారింది. వెంటనే ఆ సీన్ తొలగించాలని పలు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మనోభావాలను దెబ్బ తీయొద్దని హెచ్చరిస్తున్నాయి.



ఈ నేపథ్యంలో సోయం బాపు రావు దర్శకుడు రాజమౌళి, కొమురం భీం పాత్రధారి జూనియర్ ఎన్టీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో భీమ్ పాత్ర ధరించిన టకియాను(ముస్లింలు ధరించే టోపి) తొలగించాలని సూచించారు. అలా కాదని సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.

https://10tv.in/bjp-mp-bandi-sanjay-warning-to-director-ss-rajamouli/

కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీమ్‌ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేకుంటే మర్యాద ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సోయం బాపు రావు.