Srikanth Bolla : మన తెలుగు ఇండస్ట్రియలిస్ట్, బ్లైండ్ పర్సన్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ని తెరకెక్కిస్తున్న బాలీవుడ్.. రిలీజ్ డేట్ అనౌన్స్..
బాలీవుడ్ వాళ్ళు ఇటీవల బయోపిక్స్ వరుసగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సారి మన తెలుగు వాడైన బ్లైండ్ పర్సన్, యంగ్ ఇండస్ట్రియలిస్ట్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ని..................

Blind Person Industrialist Srikanth Bolla biopic bollywood hero rajkumar rao starring releasing in September with title sri
Srikanth Bolla : బాలీవుడ్ వాళ్ళు ఇటీవల బయోపిక్స్ వరుసగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సారి మన తెలుగు వాడైన బ్లైండ్ పర్సన్, యంగ్ ఇండస్ట్రియలిస్ట్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఈ బయోపిక్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు.
మచిలీపట్నంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు శ్రీకాంత్ బొల్లా అనే బ్లైండ్ పర్సన్. బ్లైండ్ అయినా చదువు మీద ఎంతో ఆసక్తి ఉండటంతో కష్టపడి చదివి కేంబ్రిడ్జ్ లోని ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ సంపాదించి చదివాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొని అబ్దుల్ కలాం నుంచి కూడా మన్ననలు పొందాడు. మొదట 2011లో ఓ బ్రెయిలీ లిపి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి తన లాంటి వాళ్లకు పుస్తకాలు, అవసరమైనవి ప్రింట్ చేసి ఇవ్వడం మొదలుపెట్టాడు. అనంతరం 2012 లో బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించి తన లాంటి వాళ్లకు, పర్సనాలిటీ డిజేబుల్డ్ వ్యక్తులకు ఉపాధి కల్పించాడు. దీనికి రతన్ టాటా ఫండింగ్ ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొని బ్లైండ్ పర్సన్ అయినా అత్యున్నత శిఖరాలకు ఎదిగాడు.
Deepika Padukone : ఖతార్ ఎయిర్‌వేస్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరోయిన్..
ఇప్పుడు ఈయన కథని బాలీవుడ్ బయోపిక్ తీస్తుంది. ఈ బయోపిక్ ని గత సంవత్సరమే అనౌన్స్ చేశారు. తాజాగా శ్రీ అనే టైటిల్ తో శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ని 2023 సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
RAJKUMMAR RAO: BIOPIC ON INDUSTRIALIST SRIKANTH BOLLA RELEASE DATE… #Sri – the biopic on industrialist #SrikanthBolla, starring #RajkummarRao – to release in *cinemas* on 15 Sept 2023… Also features #AlayaF, #Jyotika and #SharadKelkar. pic.twitter.com/g08g3EICu5
— taran adarsh (@taran_adarsh) March 2, 2023