×
Ad

Suhas: సుహాస్ సినిమా షూటింగులో ప్రమాదం.. బోల్తాకొట్టిన పడవ

తమిళ, తెలుగులో తెరకెక్కుతున్న 'మండాడి' సినిమా షూటింగ్ లో ప్రమాదం (Suhas)చోటుచేసుకుంది. సముద్ర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది.

Boat accident during the shooting of Suhas Mandadi's movie

Suhas: తమిళ, తెలుగులో తెరకెక్కుతున్న ‘మండాడి’ సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్ర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ (Suhas)చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. రామనాథ పురం జిల్లా తొండి సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, నీటిలో మునిగిన యూనిట్ సభ్యులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ, కోటి రూపాయల విలువ చేసే సామాగ్రి మాత్రం పూర్తిగా పాడైపోయింది.

Kalki Sequel: కల్కి సీక్వెల్ కి హీరోయిన్ దొరికేసింది.. దీపికా ప్లేస్ లో ఆ స్టార్ బ్యూటీ.. పర్ఫెక్ట్ ఛాయిస్!

ఇక ‘మండాడి’ సినిమా విషయానికి వస్తే.. త‌మిళ న‌టుడు సూరి హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటుడు సుహాస్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదే సినిమా తెలుగులో సుహాస్ హీరోగా సూరి విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి.