Kalki Sequel: కల్కి సీక్వెల్ కి హీరోయిన్ దొరికేసింది.. దీపికా ప్లేస్ లో ఆ స్టార్ బ్యూటీ.. పర్ఫెక్ట్ ఛాయిస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్(Kalki Sequel) లలో కల్కి సీక్వెల్ ఒకటి. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kalki Sequel: కల్కి సీక్వెల్ కి హీరోయిన్ దొరికేసింది.. దీపికా ప్లేస్ లో ఆ స్టార్ బ్యూటీ.. పర్ఫెక్ట్ ఛాయిస్!

Sai Pallavi to be the heroine in Kalki movie sequel

Updated On : October 5, 2025 / 9:26 AM IST

Kalki Sequel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో కల్కి సీక్వెల్ ఒకటి. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్(Kalki Sequel) త్వరలోనే మొదలుకానుంది. ఈ నేపధ్యంలోనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sathyaraj: హీరోలను నెత్తిన పెట్టుకొని ఊరేగకండి.. మాకేమీ తెలియదు.. సత్యరాజ్ అన్నది ఎవరి గురించి?

కల్కి ఫస్ట్ పార్ట్ లో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కానీ, సినిమా మేకింగ్ విషయంలో చాలా కండీషన్స్ పెట్టిందట దీపికా. కాల్ షీట్స్ విషయంలో రోజులో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తానని, అలాగే రెమ్యునరేషన్ పెంచేయడం, తన అసిస్టెంట్ లకు అయ్యే ఖర్చు కూడా భరించాలని చెప్పడం ఇలా చాలా విషయాల్లో మేకర్స్ ఇబ్బంది ఫీలయ్యారట. అందుకే కల్కి సీక్వెల్ నుంచి దీపికాను తొలగిస్తూ అధికారిక ప్రకటన చేశారు. ఇక అప్పటినుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా సీక్వల్ లో నటించే హీరోయిన్ పై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం మరోసాటి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను అనుకున్నారట. కానీ, ఫైనల్ గా ఆ అవకాశం సౌత్ స్టార్ బ్యూటీ సాయి పల్లవికి వచ్చింది అని తెలుస్తోంది. ఇప్పటికే, మేకర్స్. సాయి పల్లవి మధ్య చర్చలు కూడా జరిగాయని, సాయి పల్లవి కూడా వెంటనే ఒకే చెప్పేసిందని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆలాంటి పాత్ర సాయి పల్లవి చేస్తే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కల్కి సీక్వెల్ లో సాయి పల్లవి ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.