Boby Deol : యానిమల్ సినిమాలో హీరోకి – విలన్‌కి మధ్య కిస్ సీన్ పెట్టిన సందీప్ వంగ.. కానీ ఎడిటింగ్‌లో..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు బాబీ డియోల్.

Boby Deol Interesting Comments on Animal Movie Scenes with Ranbir Kapoor

Boby Deol : సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి, శక్తి కపూర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా మెప్పించారు.

అయితే బాబీ డియోల్ సినిమా చివర్లో కేవలం అరగంట మాత్రమే కనిపించినా ఆ పాత్ర బాగా పాపులర్ అయింది. క్లైమాక్స్ లో హీరో రణబీర్ – విలన్ బాబీ డియోల్ మధ్య ఫైట్ సీన్ ఉంటుంది. సినిమాలో వీరిద్దరూ అన్నదమ్ములు కూడా అవుతారు. ఇప్పటికే బాబీ డియోల్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ పై ఫుల్ హ్యాపీ ఉన్నట్టు తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు.

Also Read : Prabhas Maruthi : ప్రభాస్ మారుతీ సినిమాలో తమిళ్ స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?

బాబీ డియోల్ యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇందులో హీరో – విలన్ పాత్రలు అన్నదమ్ములు అవ్వడంతో వాళ్ళ మధ్య ఓ ఎమోషన్ కూడా ఉంటుంది. చివర్లో నేను రణబీర్ కి ముద్దిస్తాను. అయినా రణబీర్ కొడతాడు. నాకు డైరెక్టర్ సందీప్ వంగ కూడా.. వెనుక ఓ లవ్ సాంగ్ ప్లే అవుతుంటే ఫైట్ చేస్తూనే సడెన్ గా రణబీర్ కి కిస్ పెట్టమన్నాడు. నేను పెట్టాను. రణబీర్ మాత్రం వదిలించుకొని చంపేస్తాడు. ఈ కిస్ సీన్ కూడా షూట్ చేశారు. కానీ ఆ తర్వాత ఎడిటింగ్ లో తీసేశారు. అందుకే సినిమాలో మా ఇద్దరి మధ్య ఉన్న కిస్ సీన్ లేదు అని చెప్పాడు. దీంతో బాబీ డియోల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక కొంతమంది మాములు కిస్ లేదా లిప్ కిస్ అని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు.