‘సై సై సై రాజా సై సై.. చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్’
‘వరల్డ్ ఫేమస్ లవర్’ నుండి ‘బొగ్గు గనిలో’ లిరికల్ వీడియో రిలీజ్..

‘వరల్డ్ ఫేమస్ లవర్’ నుండి ‘బొగ్గు గనిలో’ లిరికల్ వీడియో రిలీజ్..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి హృద్యమైన సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ కాంబినేషన్లో, సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover)..
రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఎజబెల్లా, క్యాథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్, ‘మై లవ్’ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘బొగ్గు గనిలో’ అనే మరో పాట రిలీజ్ చేశారు. ‘‘బొగ్గు గనిలో రంగు మణిరా.. చమక్కు మందిరా.. చిక్కినాదిరా.. దక్కినాదిరా.. నీకే, కన్నె మోహిని సితారా.. ఏ క్లాసు నక్కతోక తొక్కిందే నీ లక్కు.. నిదరింకా రాదే నీ కళ్లకు.. పక్కా మాసోడికి దొరికే బస్తీ బంపరు సరుకు.. ఇంకేంది యాద్గిరికే మొక్కు.. సై సై సై రాజా సై సై.. చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్.. బొగ్గుట్ట పోరగాడ శీనయ్యా నువ్వట్ట సిగ్గులైతే ఎట్టయ్యా.. ముక్కట్టు ముత్యమంటి పిల్లయ్యా తగ్గట్టు జోడి మంచిగుందయ్యా’’.. అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంది.
Read Also : నా వైపు ఓ చూపు అప్పియ్యలేవా ‘జాను’
గోపి సుందర్ ట్యూన్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. నిరంజ్ సురేష్ చక్కగా పాడారు. లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కెమెరా : జయకృష్ణ గుమ్మడి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : గోపి సుందర్, ఆర్ట్ : సాహి సురేష్.