Saif Ali Khan
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఇటీవల ఓ దుండగుడు చొరబడి దాడి చేయడంతో మెడ, వెన్నుముకకు తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి హుటాహుటిన ముంబై లీలావతి హాస్పిటల్ లో చేర్పించారు. తాజాగా నేడు సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది సేపటి క్రితమే సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తన ఇంటికి వచ్చారు.
సైఫ్ అలీఖాన్ కు పలు సర్జరీలు చేయడంతో డాక్టర్లు వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్టు సమాచారం. హాస్పిటల్ నుంచి సైఫ్ డిశ్చార్జ్ అవ్వగా ఆయన వెంట తల్లి షర్మిలా ఠాగూర్ ఉన్నారు. సైఫ్ భార్య కరీనా కపూర్, కూతురు సారా అలీఖాన్, కొడుకు, పలువురు కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. సైఫ్ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తున్నాడు అని తెలియడంతో ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో సైఫ్ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సైఫ్ భద్రత కోసం ఆయన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read : Sankranthiki Vasthunnam : దిల్ రాజుపై ఐటీ దాడులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ఈవెంట్ ఉంటుందా?
సైఫ్ అలీ ఖాన్ పై దాడి..
జనవరి 16 తెల్లవారు జామున ఓ అగంతకుడు దొంగతనానికి సైఫ్ ఇంట్లో చొరపడటంతో సైఫ్ కి మెలకువ రాగా అతన్ని పట్టుకుందామని ప్రయత్నంలో ఆ దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో సైఫ్ కి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అరుపులు విని వచ్చిన సైఫ్ తనయుడు తండ్రిని తన అపార్ట్మెంట్ కిందకు తీసుకువచ్చి దగ్గర్లో ఉన్న ఆటోలో ముంబై లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. సైఫ్ వెన్నెముకలో బలంగా కత్తి దిగడంతో సర్జరీలు చేశారు. గత అయిదు రోజులుగా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్న సైఫ్ నేడు డిశ్చార్జ్ అయ్యారు.
Also Read : Allu Sneha Reddy : ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య.. అందరూ ఒకే డిజైన్ డ్రెస్‌లు వేసుకొని..
సైఫ్ పై దాడి చేసింది ఎవరు..
సైఫ్ అలీఖాన్ పై దాడిచేసిన నిందితుడిని ముంబై పోలీసులు మూడు రోజుల తర్వాత థానే నగర శివారులో దాక్కొని ఉండగా పట్టుకున్నారు. నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా, అతని పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గా గుర్తించారు. అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఉద్యోగం కోసం బిజోయ్ దాస్ గా పేరు మార్చుకున్నాడు. కొన్ని ఉద్యోగాలు చేసి దొంగతనాల కోసం రెక్కీలు చేసి డబ్బున్న వాళ్ళు బాంద్రాలో ఉంటారని తెలుసుకొని దొంగతనానికి వచ్చాడు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లగా అతనికి అది సైప్ ఇల్లు అని తెలియదని విచారణలో తెలిపాడు నిందితుడు.