Sankranthiki Vasthunnam : దిల్ రాజుపై ఐటీ దాడులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ఈవెంట్ ఉంటుందా?

త్వరలో ఏపీలో భారీగా సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేసారు.

Sankranthiki Vasthunnam : దిల్ రాజుపై ఐటీ దాడులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ఈవెంట్ ఉంటుందా?

IT Raids on Dil Raju Venkatesh Sankranthiki Vasthunnam Success Event in Doubt

Updated On : January 24, 2025 / 4:27 PM IST

Sankranthiki Vasthunnam : ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా 170 కోట్ల గ్రాస్ వసూలు చేసి 200 కోట్లకు దూసుకుపోతుంది. ఆల్రెడీ మూవీ యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్, హైదరాబాద్ లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. త్వరలో ఏపీలో భారీగా సక్సెస్ ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేసారు. ఇలాంటి సమయంలో నేడు ఈ సినిమా నిర్మాత దిల్ రాజుపై ఐటీ దాడులు జరిగాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ అవ్వడంతో జనవరి 25 సాయంత్రం వైజాగ్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు మూవీ యూనిట్. త్వరలోనే దీన్ని అధికారికంగా అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. కానీ నేడు దిల్ రాజు ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ దాడులు నిర్వహించారు. అలాగే అనిల్ రావిపూడి ఆఫీస్ పై కూడా ఐటీ దాడులు చేసినట్టు సమాచారం. దీంతో వైజాగ్ లో జరగాల్సిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఈవెంట్ చేస్తారా? చెయ్యరా అని సందేహం నెలకొంది.

Also Read : Dil Raju Wife Tejaswini : వరుసగా సినీ ప్రముఖులపై ఐటీ దాడులు.. దిల్ రాజు భార్య ఏమన్నారంటే..

ఈ ఈవెంట్ కోసం వెంకీమామ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఐటీ దాడులు ఇంకా కొనసాగుతుండటంతో ఈ ఈవెంట్ చేయాలా వద్దా అని దిల్ రాజు రేపు నిర్ణయం తీసుకుంటారని టాలీవుడ్ సమాచారం. మరి వైజాగ్ ప్రజలకు వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ ఉంటుందా ఉండదా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఇక బాలయ్య డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ రేపు జనవరి 22న అనంతపూర్ లో ఘనంగా జరుగనుంది. ఇప్పటికే అనంతపూర్ లో బాలయ్య ఫ్యాన్స్ కటౌట్స్, బ్యానర్స్ తో హంగామా చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ చేద్దామనుకున్నా తిరుపతి ఘటనతో అది రద్దవ్వడంతో మళ్ళీ సక్సెస్ ఈవెంట్ అక్కడే నిర్వహిస్తున్నారు మూవీ యూనిట్.

Also Read : Allu Sneha Reddy : ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య.. అందరూ ఒకే డిజైన్ డ్రెస్‌లు వేసుకొని..

ఇక ఐటీ దాడుల విషయానికొస్తే.. నేడు ఉదయం నుంచి వరుసగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, దిల్ రాజు సోదరుడు శిరీష్, దిల్ రాజు కూతురు హన్షిత, మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్, మైత్రి సీఈఓ చెర్రీ, నిర్మాత అభిషేక్ అగర్వాల్, దర్శకుడు అనిల్ రావిపూడి, సింగర్ సునీత భర్త రామ్ మ్యాంగో సంస్థపై, రిలయన్స్ శ్రీధర్, సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ.. ఇలా పలువురిపై వరుసగా ఐటీ దాదాలు చేస్తున్నారు.