Dil Raju Wife Tejaswini : వరుసగా సినీ ప్రముఖులపై ఐటీ దాడులు.. దిల్ రాజు భార్య ఏమన్నారంటే..

దిల్ రాజు ఇంట్లో ఉదయం నుంచి దాదాపు 7 గంటలుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Dil Raju Wife Tejaswini : వరుసగా సినీ ప్రముఖులపై ఐటీ దాడులు.. దిల్ రాజు భార్య ఏమన్నారంటే..

IT Raids on Film Industry People Dil Raju Wife Reacts on IT Raids

Updated On : January 24, 2025 / 4:28 PM IST

Dil Raju Wife Tejaswini : నేడు ఉదయం నుంచి దిల్ రాజు, మైత్రి నిర్మాతల ఇళ్ళు, ఆఫీసులలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలో మరింతమంది పై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని సమాచారం. తాజాగా దిల్ రాజు భార్య తేజస్వినిని ఐటీ అధికారులు బ్యాంక్ కి తీసుకెళ్లారు.

నేడు ఉదయం నుంచి హైదరాబాద్ లో నిర్మాత దిల్ రాజు, దిల్ రాజు సోదరుడు శిరీష్, దిల్ రాజు కూతురు హన్షిత ఇళ్లతో పాటు దిల్ రాజు రెండు ఆఫీసుల్లో, మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్, మైత్రి సీఈఓ చెర్రీ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేసారు. మొత్తం 8 చోట్ల 55 మంది అధికారులు ఐటీ రైడ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో ఇంకా చాలా మందిపై ఐటీ దాడులు చేసినట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Also Read : Allu Sneha Reddy : ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య.. అందరూ ఒకే డిజైన్ డ్రెస్‌లు వేసుకొని..

నిర్మాత అభిషేక్ అగర్వాల్, దర్శకుడు అనిల్ రావిపూడి, సింగర్ సునీత భర్త రామ్ మ్యాంగో సంస్థపై, సుకుమార్, నిర్మాతలకు సపోర్ట్ ఇచ్చే రిలయన్స్ శ్రీధర్, సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చే సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీలపై కూడా ఐటీ దాడులు చేసారు. అలాగే OG నిర్మాత DVV దానయ్య, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై ఐటీ దాడులు జరిగినట్టు వినిపిస్తుంది. ఇలా వరుస పెట్టి ఉదయం నుంచి టాలీవుడ్ లో ఐటీ దాడులు జరుగుతుండటంతో టాలీవుడ్ షాక్ కు గురవుతుంది. ఇంకా ఈ ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరింతమంది నిర్మాతల ఇళ్లపై కూడా సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

దిల్ రాజు ఇంట్లో ఉదయం నుంచి దాదాపు 7 గంటలుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజ్ భార్య తేజస్వినిని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. దీనిపై తేజస్విని మీడియాతో మాట్లాడుతూ.. సినిమా రిలేటెడ్ లో భాగంగానే సోదాలు చేస్తున్నారు. ఇవి జనరల్ గా జరిగే సోదాలు మాత్రమే. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాము అని తెలిపింది.

Also See : Pragya Jaiswal : ‘డాకు మహారాజ్’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ప్రగ్య జైస్వాల్.. ఫొటోలు చూశారా?

ఇటీవల దిల్ రాజు సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వచ్చారు. వీటిల్లో గేమ్ ఛేంజర్ కి నష్టాలు రాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు భారీగానే లాభాలు వచ్చినట్టు సమాచారం. డాకు మహారాజ్ సినిమాని కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయగా దానికి కూడా లాభాలు వచ్చాయి. ఇక మైత్రి నిర్మాతలకు పుష్ప 2 సినిమాకు భారీగా లాభాలు వచ్చాయి.