Bollywood Actor sorry to Raviteja infront of media for past things
Raviteja : టాలీవుడ్ హీరో రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. చిన్న చిన్న పాత్రలు నుంచి హీరోగా రికార్డులు క్రియేట్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రవితేజ.. ఇటీవల ముంబైలో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. అక్కడి ప్రేక్షకుల నుంచి రవితేజకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన ప్రతి సినిమాని అక్కడ రిలీజ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు.
ఇక టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న అనుపమ్ ఖేర్ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఇతనే నిజమైన ‘రౌడీ రాథోడ్’ (విక్రమార్కుడు రీమేక్), ఇతనే నిజమైన ‘కిక్’ (కిక్ రీమేక్) అని హిందీ ఆడియన్స్ కి గొప్పగా తెలియజేశాడు. ఆ రెండు సినిమాలు అక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్. కాగా తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ ఒక ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. గతంలో రవితేజని కుదరదు, పొమ్మని చెప్పాడట. అందుకు ఇప్పుడు మీడియా ముందు సారీ చెప్పాడు.
Also Read : OG Movie : పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి అదిరేపోయే అప్డేట్.. అర్జున్ దాస్..!
అసలేమి జరిగిందంటే.. రవితేజ చిన్నతనంలో అనుపమ్ ఖేర్ దగ్గరకి వెళ్లి ఆటోగ్రాఫ్ అడిగాడట. కానీ అనుపమ్ ఖేర్ ఇవ్వను అని చెప్పాడట. ఈ విషయాన్ని రవితేజ అనుపమ్ కి ఒకసారి చెప్పాడట. కాగా అప్పుడు కాదన్న నటుడు ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. దీంతో అనుపమ్.. ఆ ఇంటర్వ్యూలో అందరి ముందు రవితేజకి సారీ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కి సిద్దమవుతుంది.
1988 :- #AnupamKher rejected to click a photo with #RaviTeja ??
2023 :- #AnupamKher is doing a key role in Mass Maharaja @RaviTeja_offl most anticipated Project #TigerNageswaraRao ??
True definition of Success ?? pic.twitter.com/z3GY4rPEc7
— Neeraj Kumar (@73forever_) October 4, 2023