OG Movie : పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి అదిరేపోయే అప్డేట్.. అర్జున్ దాస్..!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చిన OG మూవీ మేకర్స్. సినిమా నుంచి అర్జున్ దాస్..

OG Movie : పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి అదిరేపోయే అప్డేట్.. అర్జున్ దాస్..!

Arjun Das update comes from Pawan Kalyan OG Movie

Updated On : October 5, 2023 / 12:59 PM IST

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘OG’. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంటే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే తమిళ నటుడు అర్జున్ దాస్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. అర్జున్ కి తెలుగులో ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల OG గ్లింప్స్ ని కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తోనే ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా మేకర్స్ అర్జున్ కి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేశారు.

నేడు (అక్టోబర్ 5) అర్జున్ పుట్టినరోజు కావడంతో మూవీ టీం.. అర్జున్ దాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో జస్ట్ అర్జున్ క్లోజప్ లుక్ మాత్రమే కనిపిస్తుంది. అయితే అది కూడా మాస్ గా కనిపిస్తుంది. ఇక ఈ అప్డేట్ చూసిన పవన్ అభిమానులు అర్జున్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా ఈ మూవీని డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత డివివి చేస్తున్న సినిమా కావడం, పవన్ కళ్యాణ్ హీరో అవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Saindhav : సంక్రాంతి బరిలో వెంకీ మామ.. ఈసారి పొంగల్ పోటీ మాములుగా లేదుగా..

ఇప్పటికే 70 శాతంపైగా షూటింగ్ పూర్తి అయ్యినట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. కాగా ఈ మూవీని రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఆడియన్స్ కి మాత్రం ఈ న్యూస్ ఫుల్ కిక్ ఇస్తుంది. పవన్ నుంచి ఒక గ్యాంగ్ స్టార్ మూవీ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. అలాంటిది ఆ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా రెండు పార్ట్స్ వస్తుందంటే అంతకుమించి పండగా ఏముంటుంది అభిమానులకు.