Deepika Padukone : ఇది కదా తెలుగు భాష ఎదుగుదల అంటే.. తెలుగువారి అభిమానం కోసం దీపికా పదుకోన్..
ఒకప్పుడు నార్త్ ఆడియన్స్‌కి.. తెలుగు సినిమాలు గురించి కాదు కదా, తెలుగు భాష గురించి కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు..

Bollywood Actress Deepika Padukone will be dubbing in telugu for Kalki
Deepika Padukone : ఒకప్పుడు భారతదేశానికి అటు పక్క ఉన్న నార్త్ ఆడియన్స్‌కి.. తెలుగు సినిమాలు గురించి కాదు కదా, తెలుగు భాష గురించి కూడా పెద్దగా తెలిసేది కాదు. సౌత్ అంటే కేవలం తమిళ భాష మాత్రమే అనుకునేవారు. ఒకవేళ నార్త్ మూవీస్ సౌత్ లో డబ్ అవ్వాలంటే.. కేవలం తమిళంలోనే డబ్ చేసేవారు. ఈ పద్ధతి మొన్నటి వరకు కొనసాగుతూనే వచ్చింది.
కానీ ఈమధ్య కాలంలో మన తెలుగు సినిమాలు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్లాయి. అంతేకాదు మన తెలుగు పాట వరల్డ్ టాప్ అవార్డు ఆస్కార్ ని కూడా గెలుచుకోవడంతో.. తెలుగు భాష గురించి ప్రపంచం నలుమూలలకు తెలిసింది. దీంతో ఒకప్పుడు తెలుగు సినిమాలకు డబ్బింగ్ చెప్పడానికి ఆలోచించిన మేకర్స్.. ఇప్పుడు సౌత్ లో మొదటిగా తెలుగు డబ్బింగ్ తోనే వస్తున్నారు.
ఇతర భాషకి చెందిన స్టార్స్ తెలుగు సినిమాల్లో నటిస్తే.. తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొత్తగా అవకాశాలు కోసం చూస్తున్న ఆర్టిస్టులు.. తెలుగు నేర్చుకోవడం కోసం ప్రత్యేక తెలుగు క్లాస్‌లు తీసుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు అనే భాష ఉందని తెలియదు. ఇప్పుడు తెలుసుకొని ఏకంగా నేర్చుకుంటున్నారు. ఇది కదా తెలుగు భాష ఎదుగుదల అంటే.
Also read : WAR 2 : వార్ 2 సెట్స్‌లోకి హృతిక్.. ఎన్టీఆర్ అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారు..
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తున్న దుల్కర్ సల్మాన్, కార్తీ, సాయి పల్లవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, రష్మిక, శ్రీలీల వంటి తారలు.. మొదటి లేదా రెండో సినిమా నుంచే తెలుగు డబ్బింగ్ చెబుతూ వస్తూ తెలుగు ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి నార్త్ భామ, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కూడా వచ్చి చేరబోతున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ప్రభాస్ ‘కల్కి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోని తన పాత్రకు హిందీ డబ్బింగ్ తో పాటు తెలుగు డబ్బింగ్ ని కూడా దీపికానే చెప్పబోతున్నారట. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గానీ, ఇన్నాళ్లు సౌత్ తారలు మాత్రమే తెలుగు పై మమకారం చూపిస్తూ వచ్చారని, ఇప్పుడు నార్త్ స్టార్స్ కూడా మొదలయ్యారని తెలుగు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.