Bollywood : విడాకుల వార్త చెప్పిన నటి.. తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా కెరీర్..

బిజినెస్ మ్యాన్‌ని ప్రేమించి పెళ్లాడిన ఆ నటి 14 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పారు. మనస్పర్థల కారణంగానే భర్త నుండి విడిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నటి?

Bollywood

Bollywood : సెలబ్రిటీల విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ భర్త టిమ్మీ నారంగ్ నుండి విడిపోయినట్లు తెలుస్తోంది. 2009 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 14 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేకప్ చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Prashanth Varma : ఒక్క డైరెక్టర్ చేతిలోనే మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు.. నెక్స్ట్ ‘అధీర’..

వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ సినిమాలోని ‘ఎక్కడికి నీ పరుగు’ అనే పాటను చాలామంది మర్చిపోరు. ఈ పాటలో నటించిన నటి ఇషా కొప్పికర్‌ను మర్చిపోరు. 1997 లో వచ్చిన ఈ సినిమాలోని ఈ పాటతో మొదటిసారి తెరపై కనిపించారు నటి ఇషా కొప్పికర్. ఆ తర్వాత 1998 లో ‘చంద్రలేఖ’ సినిమాతో పూర్తి స్ధాయిలో హీరోయిన్‌గా కెరియర్ ప్రారంభించారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ సినిమాల్లో నటించిన ఈ నటి తాజాగా తన విడాకుల వార్తతో తెరపైకి వచ్చారు. 2009 లో ప్రముఖ వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఈ నటి మనస్పర్థల కారణంగా భర్త నుండి విడిపోయినట్లు తెలుస్తోంది.

ఇషా కొప్పికర్, టిమ్మీ నారంగ్‌లకు రియానా (9) కూతురు ఉంది. కొంతకాలంగా ఇషా, టిమ్మీ నారంగ్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయని, తమ బంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించినా ఇద్దరి మధ్య సయోధ్య కుదరక ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. 2009 లో జిమ్‌లో కలుసుకున్న ఇషా, టిమ్మీ నారంగ్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ముంబయిలో పుట్టి పెరిగిన ఇషా మొదట మోడల్‌గా పలు యాడ్స్‌లో నటించారు. 1995 మిస్ ఇండియా పోటీలో మిస్ టాలెంట్ క్రౌన్‌ను గెలుచుకున్నారు. 2000 లో హృతిక్ రోషన్ నటించిన ఫిజా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా 2002 లో రామ్ గోపాల్ వర్మ కంపెనీ సినిమాలో ‘ఖల్లాస్’ అనే ఐటమ్ సాంగ్‌తో బాగా పాపులర్ అయ్యారు.

Devil Review : ‘డెవిల్’ మూవీ రివ్యూ.. దేశభక్తితో కూడిన సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా..

అప్పట్లో నటుడు (దివంగత) ఇందర్ కుమార్‌తో ఇషా ప్రేమాయణం సాగించారని చెబుతారు. ఆ తర్వాత టిమ్మీ నారంగ్‌ను పెళ్లాడారు ఇషా. పెళ్లైనా అడపాదడపా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఇషా బిజీగా ఉన్నారు. ఇషా ప్రస్తుతం తమిళ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘అయలాన్’ లో కనిపించనున్నారు. ఆర్.రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కెజెఆర్ స్టూడియోస్ పతాకాంపై కోటపాడి జె రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్ మరియు బాల శరవణన్ కూడా నటిస్తున్నారు.