Prashanth Varma : ఒక్క డైరెక్టర్ చేతిలోనే మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు.. నెక్స్ట్ ‘అధీర’..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటూ వరుస పెట్టి 12 సూపర్ హీరోల సినిమాలు తీసుకు రాబోతున్నారు. మొదటిగా హనుమాన్ సూపర్ హీరో, ఆ తరువాత..

Prashanth Varma Cinematic Universe come with 12 super hero films including Hanuman
Prashanth Varma : టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ‘అ’, ‘జాంబిరెడ్డి’ సినిమాలతో టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘హనుమాన్’ అనే సూపర్ హీరో సినిమా తెరకెక్కిస్తున్నారు. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రంతో ప్రశాంత్ వర్మ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటూ వరుస పెట్టి సూపర్ హీరోల సినిమాలు తీసుకు రాబోతున్నారు. మొదటిగా హనుమాన్ సూపర్ హీరో మూవీని తీసుకు వస్తున్నారు. హిందూ దేవుడు హనుమంతుడి పవర్స్ ని ఈ సూపర్ హీరో మూవీతో ప్రపంచానికి తెలియజేయబోతున్నారు. ఇక ఈ మూవీ తరువాత ‘అధీర’ని తెరకెక్కించనున్నారు. నిర్మాత డివివి దానయ్య కుమారుడు ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు.
Also read : Devil Review : ‘డెవిల్’ మూవీ రివ్యూ.. దేశభక్తితో కూడిన సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా..
ఈ సినిమాలో దేవతల రాజు ‘ఇంద్రుడు’ పవర్స్ ని చూపించబోతున్నారు. ఇలా ఈ యూనివర్స్ లో హిందూ గాడ్స్ ని సూపర్ హీరోస్ గా అందరికి పరిచయం చేయబోతున్నారు. ఇక ఈ యూనివర్స్ లో మొత్తం 12 సినిమాలు రాబోతున్నాయట. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూల్లో తెలియజేశారు. ఇక ఈ కామెంట్స్ విన్న ఆడియన్స్.. మిగిలిన 10 సినిమాల్లో ఏ దేవుడిని సూపర్ హీరో చేయబోతున్నారో అనే ఆసక్తి కలిగింది.
కాగా అవెంజర్స్ సూపర్ హీరోస్ సినిమాల్లో గ్రీక్ దేవుడు ‘థోర్’ని సూపర్ హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ గాడ్స్ ని కూడా ప్రపంచానికి సూపర్ హీరోలుగా చూపించే భాద్యతని ప్రశాంత్ వర్మ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ చిత్రాల్లో ఏ హీరో నటించి ఆడియన్స్ కి సూపర్ హీరోగా కనిపించబోతున్నాడో అనేది కూడా ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం హనుమాన్ విషయానికి వస్తే.. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న హనుమాన్ రిలీజ్ కానుంది.