Bollywood Actress Madhura Naik shares Emotional Video on Israel Palestine War
Madhura Naik : పాలస్తీనా(Palestine) – ఇజ్రాయిల్(Israel) వార్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా మార్చి, వారిపై అకృత్యాలకు పాల్పడి, పలువురిని కిరాతకంగా చంపేస్తున్నారు. ఇజ్రాయిల్ తీవ్రవాదుల దాడికి సమాధానం చెప్పాలని వాళ్ళు కూడా హమాస్ లు ఉన్న స్థావరాలపై దాడులు మొదలుపెట్టారు. అయితే ఈ యుద్ధంలో పలువురు వేరే దేశాలకు చెందినవారు ఇజ్రాయిల్ లో చిక్కుకుపోయారు. వారి పరిష్టితి దయనీయంగా ఉంది.
ఇటీవలే ఇజ్రాయిల్ లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుశ్రుతా భరూచా క్షేమంగా ఇండియాకు చేరుకుంది. తాజాగా ఇండియా – ఇజ్రాయిల్ సంతతికి కి చెందిన బాలీవుడ్ నటి మధురా నాయక్ ఓ ఎమోషనల్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్(Bollywood) లో పలు సీరియల్స్, సిరీస్, సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది మధురా నాయక్. ఈమె బంధువులు చాలా మంది ఇజ్రాయిల్ లోనే ఉంటారు.
Also Read : Bigg Boss 7 Day 37 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారు? ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ళు
మధురా నాయక్ తాజగా ఓ వీడియోని షేర్ చేసి.. నా సోదరి, ఆమె భర్తని పాలస్తీనా ఉగ్రవాదులు వారి పిల్లల ముందే చంపేశారు. ఉగ్రదాడిలో మా బంధువులు చాలామందిని కోల్పోయాను. వారు ఎప్పటికి గుర్తుండిపోతారు. మా ప్రార్థనలు ఇజ్రాయిల్ లో ఉన్న బాధితులందరికీ అండగా ఉంటాయి. ప్రజలందరూ ఈ సమయంలో ఇజ్రాయిల్ కి అండగా నిలవాలి. ఉగ్రవాదుల దాడులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇజ్రాయిల్ లో పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు పట్టపగలే మహిళలు, పిల్లలు, వృద్దులని చంపేస్తున్నారు. నేను ఎలాంటి హింసని సమర్ధించాను. అక్కడి బాధిత కుటుంబాల కోసం మనం ప్రార్థించాలి అంటూ ఓ ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అలాగే వారి ఫోటోలని కూడా షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది.