Bigg Boss 7 Day 37 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారు? ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ళు

ఈ వారం కొత్తగా అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సీక్రెట్ రూమ్ లోకి పంపిన గౌతమ్ కూడా కొత్త కంటెస్టెంట్ లాగా తిరిగొచ్చాడు. సోమవారం నాడు నామినేషన్స్ పూర్తయ్యాయి.

Bigg Boss 7 Day 37 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారు? ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ళు

Bigg Boss 7 Day 37 Highlights Gautham Re entry New Contestants Vs Old Contestants

Updated On : October 11, 2023 / 7:27 AM IST

Bigg Boss 7 Day 37 : బిగ్‌బాస్ అయిదు వారాలు పూర్తయి ఆరోవారం సాగుతుంది. ఈ వారం కొత్తగా అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సీక్రెట్ రూమ్ లోకి పంపిన గౌతమ్ కూడా కొత్త కంటెస్టెంట్ లాగా తిరిగొచ్చాడు. సోమవారం నాడు నామినేషన్స్ పూర్తయ్యాయి. సోమవ్వారం ఎపిసోడ్ నాటికి నామినేషన్స్ లో అమర్ దీప్, యావర్, సందీప్, తేజ, శోభాశెట్టి, నయని పావని, అశ్విని, పూజా మూర్తిలు ఉన్నారు. కొత్తగా వచ్చిన ముగ్గురు కూడా నామినేట్ అవ్వడం గమనార్హం.

ఇక సీక్రెట్ రూమ్ లోకి పంపిన గౌతమ్ నిన్న మంగళవారం ఎపిసోడ్ లోకి వచ్చి అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అంటూ కాసేపు హంగామా చేసాడు. మరీ ఓవర్ చేసినట్టు ప్రేక్షకులకి అనిపించింది. పాత కంటెస్టెంట్స్ ని ఆటగాళ్లు అని కొత్త కంటెస్టెంట్స్ ని పోటుగాళ్ళు అని బిగ్‌బాస్ డివైడ్ చేశాడు. గౌతమ్ ని కొత్తగా వచ్చిన వాళ్ళతో కలిపాడు బిగ్‌బాస్. అలాగే గౌతమ్ కి స్పెషల్ పవర్ ఇచ్చి నామినేషన్స్ లో ఉన్న వాళ్లలో ఎవరినైనా సేవ్ చేయొచ్చు లేదా వేరే ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అన్నాడు బిగ్‌బాస్. దీంతో గౌతమ్ నామినేషన్స్ లో ఉన్న సందీప్ ని సేవ్ చేసాడు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్, యావర్, తేజ, శోభాశెట్టి, నయని పావని, అశ్విని, పూజా మూర్తిలు ఉన్నారు.

Also Read : Bigg Boss 7 : రీ ఎంట్రీ ఇచ్చిన గౌత‌మ్‌.. తేజాతో ఆడుకున్న బిగ్‌బాస్‌

అనంతరం హూ ఈజ్ ది బెస్ట్ అనే టాస్క్ ఇచ్చి అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు కెప్టెన్సీ టాస్కులకు అర్హత సాధిస్తారని ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ళు మధ్య గేమ్స్ పెట్టి గొడవలు పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో పోటుగాళ్ళు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు గెలిచారు. మరో గేమ్ కూడా పెట్టారు. మరి ఈ వారం కెప్టెన్సీ ఎవరివైపు ఉన్న వాళ్ళు అవుతారో చూడాలి. ఆ తర్వాత నైట్ తేజ, సందీప్ హౌస్ లో దొంగతనం చేసే పనిలో పడ్డారు.