Manava Arun Naik : రాత్రిపూట బాలీవుడ్ నటికి క్యాబ్ డ్రైవర్ తో చేదు అనుభవం.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి..

పలు బాలీవుడ్, మరాఠి సినిమాల్లో నటించిన నటి మానవ అరుణ్ నాయక్ కి అర్ధరాత్రి ఓ క్యాబ్ డ్రైవర్ తో చేదు అనుభవం ఎదురైంది. మానవ నాయక్ శనివారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ నుంచి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ ఎక్కిన తర్వాత............

Bollywood actress manava naik said a uber driver missbehaviour with her

Manava Arun Naik :  పలు బాలీవుడ్, మరాఠి సినిమాల్లో నటించిన నటి మానవ అరుణ్ నాయక్ కి అర్ధరాత్రి ఓ క్యాబ్ డ్రైవర్ తో చేదు అనుభవం ఎదురైంది. మానవ నాయక్ శనివారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ నుంచి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో ఫోన్ పక్కనపెట్టి డ్రైవింగ్ చేయమని వారించింది. అయినా ఆ డ్రైవర్ వినకుండా అలాగే తోలుతుండగా ఇంతలో ట్రాఫిక్ పోలీసులు ఉండటంతో సిగ్నల్ జంప్ చేసి మరీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత కారుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లమని నటి అడగ్గా ఆ క్యాబ్ డ్రైవర్ మరింత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ, ఆమెని తిడుతూ, 500 నువ్వు కడతావా ఫైన్ అంటూ దూషిస్తూ ఒక ఖాళీ ప్లేస్ కి తీసుకెళ్లి ఆపాడు. అతను మరింత తిట్టడం మొదలుపెట్టడంతో నిర్మానుష్య ప్రదేశంలో అతను కార్ ఆపాడని గ్రహించి నటి అరవడం మొదలుపెట్టింది. ఇది గమనించిన అటుగా వెళ్తున్న ఓ ఇద్దరు వ్యక్తులు, ఓ రిక్షా అతను ఆమెని కాపాడారు. అతనిని తిట్టి పంపించేశారు.

Ori Devuda Pre Release Event : ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన రామ్ చరణ్..

ఆ క్యాబ్ డ్రైవర్ ఫోటోని, ఆ కార్ నుంబర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సంఘటనని తెలిపి మహారాష్ట్ర పోలీసులకి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్యాగ్ చేసింది. దీంతో పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. అలాగే ఆ క్యాబ్ నిర్వహణ సంస్థకి కూడా నోటీసులు పంపినట్టు తెలిపారు. ఈ మేరకు నటి మానవ నాయక్ ముంబై పోలీసులకి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసింది.