Premanand Ji Maharaj
Premanand Ji Maharaj : భక్తులు తమకు తోచినంతలో దేవుళ్ళకు, ఆలయాలకు, స్వామీజీలకు ఏదో ఒకటి డొనేట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ భర్త ఏకంగా ఓ స్వామీజీకి తన కిడ్నీనే ఇస్తా అంటున్నాడు. ఇంతకీ ఆ స్వామిజీ ఎవరు? ఆ హీరోయిన్ భర్త ఎవరు అంటే..
ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ స్వామిజీ ప్రేమానంద్ మహారాజ్. ఆయన రాధాకృష్ణులను పూజిస్తుంటారు. ఆయన దగ్గరకు అనేక మంది సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ప్రేమానంద్ మహారాజ్ స్వామిజీ ఆశ్రమానికి వెళ్లారు. స్వామిజీ మాట్లాడుతూ మధ్యలో నా రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఆ కండిషన్ తోనే పదేళ్ల నుంచి బతుకుతున్నాను అని తెలిపారు.
Also Read : Hrithik Roshan : వార్ 2 రిలీజ్ కి ముందు 31 కోట్లు ఖర్చుపెట్టిన హృతిక్ రోషన్.. ఎందుకంటే..?
దీంతో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని రెండేళ్లుగా ఫాలో అవుతున్నాను. నాకు ఎలాంటి సందేహాలు లేవు. మీ వీడియోలతో నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వచ్చాయి. మీరు అందరికి ప్రేరణ ఇస్తారు. మీ హెల్త్ కండిషన్ గురించి నాకు ముందుగానే తెలుసు. నేను మీకు సహాయం చేయగలిగితే నా కిడ్నీలలో ఒకటి మీకు ఇస్తాను అని తెలిపాడు. దీంతో పక్కనే ఉన్న శిల్పాశెట్టి సైతం ఆశ్చర్యపోయింది.
అయితే రాజ్ కుంద్రా మాటలకు ప్రేమానంద్ మహారాజ్ స్వామిజీ సమాధానమిస్తూ.. నువ్వు ఆ మాట అన్నందుకు సంతోషం. మనకు పిలుపు వచ్చేంతవరకు మనం ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళము అది కూడా ఒక కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల. నీ మంచి మనుసుని నేను అర్ధం చేసుకున్నాను అని అన్నారు. రాజ్ కుంద్రా స్వామిజీకి కిడ్నీ ఆఫర్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చగా మారింది.
Also Read : War 2 Collections : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు? ‘కూలీ’ కంటే తక్కువే..
ఇక రాజ్ కుంద్రాపై ఇప్పటికే పలు కేసులు, ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రెండు రోజుల క్రితమే 60 కోట్లు మోసం చేసారంటూ ఓ వ్యక్తి రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేసారు.