×
Ad

Taapsee Pannu : పెళ్లి పీటలు ఎక్కబోతున్న తాప్సీ.. ఆ నెలలో అక్కడే వివాహం..

తాప్సీ పెళ్లి పనులు ఆల్రెడీ మొదలయ్యిపోయాయి అంట. ఇంతకీ తాప్సీ పెళ్లి చేసుకోబోతున్నది ఎవర్ని..? పెళ్లి ఎప్పుడు..?

  • Published On : February 28, 2024 / 03:24 PM IST

Bollywood Actress Taapsee Pannu marriage news gone viral

Taapsee Pannu : బాలీవుడ్ లో మరో భామ కూడా పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాతని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మరో హీరోయిన్ తాప్సీ కూడా ఏడడుగులు వేయడానికి సిద్దమవుతున్నారట. ఆల్రెడీ పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ తాప్సీ పెళ్లి చేసుకోబోతున్నది ఎవర్ని..?

తాప్సీ పన్ను గత పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ ‘మథియాస్ బోయ్‌’తో ప్రేమలో ఉన్నారు. ఇన్నాళ్లు లవ్ జర్నీ చేసిన వీరిద్దరూ.. మార్చి నెల నుంచి పెళ్లి ప్రయాణం మొదలు పెట్టబోతున్నారంట. నేషనల్ మీడియా కథనాలు ప్రకారం.. మార్చి చివరిలో ఈ వివాహం జరగబోతుందని సమాచారం. ఇక ఈ పెళ్ళికి ఉదయపూర్‌ లోని ప్యాలస్ వేదిక కానుందని చెబుతున్నారు. సిక్కు, క్రిస్టియన్ సంస్కృతిలో వివాహం జరగబోతుందట.

Also read : Vyooham : ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్స్‌కి.. అమితాబ్‌ని వాడేస్తున్న ఆర్జీవీ..

Bollywood Actress Taapsee Pannu marriage news gone viral

ఇక ఈ పెళ్ళికి బాలీవుడ్ స్టార్స్ ఎవరూ హాజరు అవ్వరని, కేవలం కుటుంబసభ్యులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలు గురించి తాప్సీ మాత్రం నోరు విప్పడం లేదు. ‘మార్చి నెలాఖరులో మీ వివాహం జరగబోతుందనే వార్తలో ఎంత నిజముందని తాప్సీ ప్రశ్నించాగా, ఆమె బదులిస్తూ.. “నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పై నేను ఎప్పుడూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అంతే, ఎప్పటికీ ఇంతే” అంటూ ఆన్సర్ ఇవ్వకుండా మాట దాటేసారు.

కాగా తాప్సీ తెలుగు సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మేకర్స్ ఆమెను పెద్దగా పట్టించుకోకపోవడంతో.. బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమా అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు తాప్సీ ఫస్ట్ ఛాయస్ అయ్యారు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో కలిసి ‘డంకీ’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.