Shah Rukh Khan : ముఫాసాతో తనను పోల్చుకున్న షారుఖ్ ఖాన్.. నేను కూడా దానిలాగే చీకటిని అధిగమించానంటూ..
షారుక్ ఖాన్ ముఫాసా ద లయన్ కింగ్ లో ముఫాసా పాత్రకి హిందీలో డబ్బింగ్ చెప్పారు.

bollywood badshah Shahrukh Khan compared himself to Mufasa in The Lion King
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‍షా షారుక్ ఖాన్ క్రేజ్ ఏ లెవల్లో ఉందో తెలిసిందే. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే షారుక్ ఖాన్ ముఫాసా ద లయన్ కింగ్ లో ముఫాసా పాత్రకి హిందీలో డబ్బింగ్ చెప్పారు. ఇక తెలుగులో ముఫాసా కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించారు. ముఫాసా ది లయన్ కింగ్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ మరియు తమిళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.
అయితే ఇందులో భాగంగా షారుఖ్ ఖాన్ ముఫాసా పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ముఫాసాతో తనకున్న అనుభవాన్ని తెలిపారు. ముఫాసా అడివికి రారాజుగా మారడానికి పడ్డ కష్టాలు, పోరాటాలు, చీకటిని ఎదురుకొని అడివికి రారాజు ఎలా అవుతాడో చూస్తారు. ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదురుకొని రాజు అవుతాడు అని షారుఖ్ తెలిపారు. అంతేకాదు ఈ కథ తన నిజ జీవిత కథలాగే ఉందని. తాను కూడా ఇన్ని ఇబ్బందులు ఎదురుకొని ఈ స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. ముఫాసాలానే తను కూడా ఎంతో కష్టపడి, సంకల్పంతో ఈ స్థాయికి వచ్చానని తెలిపారు షారుఖ్.
Also Read : Ram Gopal Varma : ‘వాటికి చట్టపరమైన సమాధానం ఇచ్చా.. నా ట్వీట్స్ తో వాళ్ళకేంటి బాధ’.. ఆర్జీవీ
దీంతో షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ముఫాసా ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇప్పటికే దీనికి సంబందించిన టీజర్, ట్రైలర్ సైతం విడుదల చేసారు మేకర్స్.