Bollywood Director Anil Sharma Comments on Allu Arjun Pushpa 2 Movie
Anil Sharma : స్టార్ హీరోల సినిమాలు, పెద్ద హిట్ అయిన సినిమాలు ఉన్నప్పుడు వేరే సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టమే అవుతుంది. తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ పుష్ప 2 సినిమా వల్ల తన సినిమాకు థియేటర్స్ లేవు అని అన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా పుష్ప 2 సినిమా గత సంవత్సరం డిసెంబర్ 5న రిలీజయి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
పుష్ప 2 సినిమాకు నార్త్ లో విపరీతమైన స్పందన వచ్చింది. టికెట్ల కోసం థియేటర్స్ దగ్గర భారీ క్యూలైన్స్ ఏర్పడ్డాయి. పుష్ప 2 క్రేజ్ చూసి ఆల్మోస్ట్ నార్త్ లో అన్ని థియేటర్స్ కొన్ని రోజుల పాటు పుష్ప 2 సినిమానే నడిపించాయి. అందుకే పుష్ప 2 సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ నార్త్ నుంచే వచ్చాయి. ఆల్మోస్ట్ నెల రోజులు పైనే నార్త్ థియేటర్స్ లో పుష్ప 2 అదరగొట్టేసింది.
అయితే డిసెంబర్ 20న బాలీవుడ్ లో వనవాస్ అనే సినిమా రిలీజయింది. అనిల్ శర్మ దర్శకత్వంలో నానా పాటేకర్ మెయిన్ లీడ్ గా ఫ్యామిలీ వ్యాల్యూస్, ఫ్యామిలీ డ్రామాగా వనవాస్ సినిమా రిలీజయింది. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాగా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి రానుంది.
ఈ క్రమంలో దర్శకుడు అనిల్ శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా రిజల్ట్ నన్ను నిరాశపరిచింది. కానీ చూసిన ప్రేక్షకులకు నా సినిమా నచ్చింది. నా సినిమా చూసి ఏడ్చారు. నేను తీసిన బెస్ట్ సినిమాల్లో ఇదొకటి. సినిమా బాగుంది కానీ రాంగ్ టైంలో రిలీజ్ అయింది. ఆ సమయంలో పుష్ప 2 సినిమా థియేటర్స్ లో బాగా నడుస్తుంది. దాని వల్ల మాకు థియేటర్స్ లభించలేదు. కానీ శాటిలైట్, ఓటీటీ ద్వారా ఈ సినిమా ఫ్యామిలీ సినిమా అవుతుంది. అందుకే నేను దాని గురించి ఎక్కువ బాధపడట్లేదు. యాక్షన్ సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి రానుంది. ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది అని అన్నారు. దీంతో అనిల్ శర్మ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇదే డైరెక్టర్ అనిల్ శర్మ గతంలో గదర్ 2 లాంటి భారీ హిట్ సినిమాలు కూడా తీసాడు. పుష్ప 2 రిలీజయిన 15 రోజులకు వనవాస్ సినిమా రిలీజయింది. అప్పటికి థియేటర్స్ దొరకలేదంటే పుష్ప 2 నార్త్ లో ఏ రేంజ్ లో ఆడిందో, బాలీవుడ్ ని ఎంత డామినేట్ చేసిందో అర్ధం అవుతుంది.