Mega Women Interview : ఉమెన్స్ డే స్పెషల్ ‘మెగా వుమెన్’ ఇంటర్వ్యూ.. పిల్లలతో అంజనమ్మ.. పవన్ కూడా ఉంటే బాగుండేది..
మెగా స్పెషల్ ఉమెన్స్ డే ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి..

Chiranjeevi Mother Mega Women Interview Promo Goes Viral
Mega Women Interview : రేపు మార్చ్ 8 ఉమెన్స్ డే అని తెలిసిందే. ఈ క్రమంలో మెగా స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన పిల్లలు చిరంజీవి, నాగబాబు, విజయ దుర్గలతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేసారు. ఫుల్ ఇంటర్వ్యూ రేపు రిలీజ్ కానుంది.
Also Read : Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్.. ‘పాబ్లో నెరుడా..’ సాంగ్ విన్నారా?
మెగా స్పెషల్ ఉమెన్స్ డే ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి..
Heartwarming and inspiring talk with the #MegaWomen❤️
Little secrets, big revelations and much more on this beautiful interview on account of #WomensDay ✨
Full interview out tomorrow!#Chiranjeevi #NagaBabu #PawanKalyan #RamCharan pic.twitter.com/IqPKAVkjjm
— Beyond Media (@beyondmediapres) March 7, 2025
ఈ ఇంటర్వ్యూలో అందరూ తమ తల్లితో చిన్నప్పుడు ఉన్న మెమరీలు పంచుకున్నట్టు తెలుస్తుంది. అలాగే వారి లైఫ్ లో తమ తల్లి ఎంతలా సపోర్ట్ చేసిందో చెప్పారు. నాగబాబు అంజనమ్మకు ఫేవరేట్ చైల్డ్ అని చిరంజీవి అన్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోని చాలా బాగుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Shivangi : ‘శివంగి’ మూవీ రివ్యూ.. ఓ పెళ్లయిన అమ్మాయికి ఒకేసారి అనేక సమస్యలు వస్తే..
అయితే ఈ ఇంటర్వ్యూ లో నాలుగు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ లేడు. దీంతో ఫ్యాన్స్ పవన్ కూడా ఈ ఇంటర్వ్యూలో ఉంటే చాలా బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రేపు ఉమెన్స్ డే కి మెగా స్పెషల్ ఇంటర్వ్యూ వైరల్ కానుందని తెలుస్తుంది.