Rahul Roy : ఫస్ట్ సినిమా పెద్ద హిట్.. 10 రోజుల్లో 40 సినిమాలకు ఒప్పందం.. కానీ విధి ఆడిన నాటకంలో.. ఎవరో తెలుసా..?
ఓ హీరో తాను హీరోగా చేసిన మొదటి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆ తర్వాత పది రోజుల్లో 40 సినిమాలకు సైన్ చేసాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు..

Bollywood Hero Rahul Roy Story why he failed as Hero After Aashiqui Hit
Rahul Roy : సినీ పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు స్టార్ డమ్ వస్తుందో ఎవరికీ తెలియదు. కొంతమంది ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. అలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం, ఇప్పటికి చూస్తూనే ఉన్నాము . అలా ఒక్క సినిమాతో స్టార్ డమ్ వచ్చినా దాన్ని నిలబెట్టుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. బాలీవుడ్ లో ఓ హీరో తాను హీరోగా చేసిన మొదటి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆ తర్వాత పది రోజుల్లో 40 సినిమాలకు సైన్ చేసాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు..
ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా..? బాలీవుడ్ లో 1990లో వచ్చిన సూపర్ హిట్ లవ్ స్టోరీ సినిమా ‘ఆషికీ’ హీరో రాహుల్ రాయ్. బాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్, చిన్న చిన్న పాత్రలు వేసుకునే రాహుల్ రాయ్ ఆషికీ సినిమాతో హీరోగా ఛాన్స్ కొట్టేసాడు. ఆ సినిమా భారీ విజయం సాధించింది. బాలీవుడ్ లో లవ్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో రాహుల్ రాయ్ కి బాగా పేరొచ్చింది.
Also Read : Pawan Kalyan – Aadya : కూతురుతో డిప్యూటీ సీఎం.. కూతురి కోసం షాపింగ్ చేసిన పవన్ కళ్యాణ్..
ఆషికీ రిలీజయి హిట్ అయిన తర్వాత రాహుల్ రాయ్ కేవలం 10 రోజుల్లో 40 సినిమాలను ఓకే చేసాడు. అందులో స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ డైరెక్టర్స్ సినిమాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ అంతా రాహుల్ రాయ్ స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే విధి ఇంకోటి తలిచింది అన్నట్టు ఆ 40 సినిమాల్లో పట్టుమని పది కూడా రిలీజ్ అవ్వలేదు.
ఓ సినిమా నిర్మాత చనిపోయి, ఓ సినిమా డైరెక్టర్ చనిపోయి, కొన్ని సినిమాలు షూట్ మొదలయి బడ్జెట్ లేక ఆగిపోయి.. ఇలా రకరకాల కారణాలతో రాహుల్ రాయ్ ఓకే చేసిన సినిమాలు చాలా వరకు ఆగిపోయాయి. ఆషికీ ఫేమ్ తో రాహుల్ రాయ్ ఓకే చేసిన సినిమాల్లో ఓ పది మాత్రం రిలీజ్ అయినా అవి అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఆ తర్వాత అడపాదడపా హీరోగా సినిమాలు చేసినా స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదగలేదు.
అయితే అదే సమయంలో షారుఖ్, సల్మాన్ కూడా హీరోలుగా ఎదుగుతున్నారు. వాళ్ళు కావాలని రాహుల్ రాయ్ ని తొక్కేశారని అప్పట్లో బాలీవుడ్ లో ప్రచారం సాగింది. వీటిల్లో ఎంతవరకు నిజముందో కానీ మొదటి సినిమా భారీ హిట్ అయి దాంతో వచ్చిన ఇమేజ్ ని మాత్రం పలు కారణాలతో రాహుల్ రాయ్ నిలబెట్టుకోలేకపోయాయడు. ప్రస్తుతం రాహుల్ రాయ్ అడపాదడపా ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నాడు. ఇలాంటి హీరో గతంలో హిందీ బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా కూడా వెళ్ళాడు.