Bollywood Heroine Sara Ali Khan shares her fitness journey
Sara Ali Khan : బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్.. సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కేదార్నాథ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది. సారా చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు లీన్ గా నాజూకు సొగసుతో కనిపించే సారా.. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా కనిపించేది. అప్పటి ఫోటోని చూస్తే మీరుకూడా షాక్ అవుతారు.
ఇలా ఉన్న సారా.. తన డెడికేషన్ తో ఇప్పుడు లీన్ గా మారింది. టైం టేబుల్ వేసుకొని మరి జిమ్ లో కసరత్తులు చేసి ఎంతో కష్టపడింది. తోటి హీరోయిన్స్ తో కలిసి ఫిట్‌నెస్ ఛాలెంజ్ లు పెట్టుకొని వర్క్ అవుట్స్ చేయడం.. ఇలా ఏదో రకంగా ఫిట్‌నెస్ జర్నీని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. తాజాగా సారా తన ఫిట్‌నెస్ జర్నీని గుర్తు తెచ్చుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది.
Also read : SSMB29 : మహేష్ రాజమౌళి సినిమాకి పని చేయనంటున్న సినిమాటోగ్రాఫర్..!
ఆ పోస్ట్ లో తన లావుగా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. “ఈ పిక్ షేర్ చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ రెండు వారాల్లో అలా ఉన్న నేను ఇలా మారినందుకు చాలా గర్వంగా ఉంది. బరువు సమస్య నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండేది. దానిని అధిగమించేందుకు నాకు సహాయపడిన వారికీ కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సారా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.