SSMB29 : మహేష్ రాజమౌళి సినిమాకి పని చేయనంటున్న సినిమాటోగ్రాఫర్..!

స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మహేష్ రాజమౌళి సినిమాకి పని చేయను అని చెప్పినట్లు తెలుస్తుంది.

SSMB29 : మహేష్ రాజమౌళి సినిమాకి పని చేయనంటున్న సినిమాటోగ్రాఫర్..!

Senthil Kumar said no for Mahesh Babu Rajamouli SSMB29

Updated On : November 7, 2023 / 3:04 PM IST

SSMB29 : రాజమౌళి, మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. RRR తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పనిలో ఉన్నాడు. కాగా ప్రెజెంట్ మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయ్యాక కొంచెం గ్యాప్ తీసుకొని రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నాడట. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ సంబంధించిన ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూ వస్తుంటుంది.

తాజాగా స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈ సినిమాకి పని చేయను అని చెప్పినట్లు తెలుస్తుంది. ‘సై’ చిత్రం సెంథిల్ రాజమౌళి సినిమాలకు పని చేస్తూ వచ్చాడు. మధ్యలో ‘మర్యాద రామన్న’, ‘విక్రమార్కుడు’ సినిమాలకు మాత్రం ఇతర డిఓపిలు పని చేశారు. బాహుబలి, RRR వంటి సినిమాలకు కూడా సెంథిలే పని చేశాడు. అయితే ఈ కెమెరా మ్యాన్ ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఎప్పటి నుంచో ఈ ప్రయత్నంలో ఉన్నాడట. రాజమౌళి గత సినిమాలకు కూడా ఈ డిఓపి దూరంగా ఉండాలి.

Also read : Yatra 2 Movie : ‘యాత్ర 2’ సినిమాలో సోనియా గాంధీగా ఎవరు నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

కానీ రాజమౌళి కోరడంతో సెంథిల్ అడ్జస్ట్ అయ్యి ఆ సినిమాలకు పని చేశాడు. కానీ ఈసారి మాత్రం రాజమౌళికి కుదరదు అని కచ్చితంగా చెప్పేశారట. దీంతో ఈ ప్లేస్ లోకి పిఎస్ వినోద్ పేరుని ఆలోచిస్తున్నారట. మరి కొన్ని పేర్లు కూడా పరిశీలినలో ఉన్నాయట. మరి ఇన్నాళ్ల రాజమౌళి, సెంథిల్ కుమార్ మ్యాజిక్ మహేష్ సినిమాలో మిస్ అవుతుందనే చెప్పాలి. అయితే అక్కడ ఉన్నదీ జక్కన్న కాబట్టి.. SSMB29 కోసం మంచి డిఓపినే రంగంలోకి దించుతాడు. మరి ఈ ప్రాజెక్ట్ లోకి వస్తారో చూడాలి.