NTR
NTR : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బాలీవుడ్ సినిమా వార్ 2. రేపు ఆగస్టు 14 న ఈ సినిమా భారీగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా దాదాపు 20 కోట్ల వరకు ప్రీ సేల్స్ జరిగాయి.
ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించడంతో ఇక్కడ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సినిమాని చూసినట్టు టాక్. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం .. ఎన్టీఆర్ వార్ 2లో సినిమా మొదలయిన 20 నిమిషాలలోపే ఎంట్రీ ఇస్తాడట. యాక్షన్ సీన్స్ నీళ్ళల్లో, గాలిలో, ట్రైన్ మీద, మంచులో, మంటల్లో.. ఇలా రకరకాలుగా యాక్షన్ సీన్స్ డిజైన్ చేసారంట. అన్ని యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అని చెప్తున్నారు.
Also Read : Kantara : వరుస మరణాలు, ప్రమాదాలు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కాంతార నిర్మాత..
ఇక ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుంది అని, ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ తో పాటు, ఎమోషనల్ సీన్స్ తో కూడా ఫుల్ గా డామినేట్ చేసాడని, క్లైమాక్స్ అయితే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తుందని అంటున్నారు. దీంతో ఎన్టీఆర్ కోసం తెలుగు ప్రేక్షకులు వార్ 2 సినిమాని చూడటానికి రెడీ అయిపోతున్నారు.