Vijay Deverakonda : విజయ్ దేవరకొండ టైర్ 2 హీరో.. దేవుడిలా ట్రీట్ చేసారు.. బాలీవుడ్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఓ బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ ఓ ఇంటర్వ్యూలో సౌత్ హీరోల గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండని తీవ్రంగా విమర్శించాడు.

Bollywood Journalist Sensational Comments on Vijay Deverakonda

Vijay Deverakonda : కష్టపడి పైకి ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తక్కువ సినిమాలతోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తన స్పీచ్ లు, స్టైల్ తో ఫ్యాన్స్ ని తెచ్చుకున్నాడు. విజయ్ మంచి హిట్ కొట్టి చాలా కాలమైంది. విజయ్ లైగర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని గట్టిగానే ట్రై చేసాడు. ఆ సినిమాకు బాలీవుడ్ లో భారీగా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసారు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది.

తాజాగా ఓ బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ ఓ ఇంటర్వ్యూలో సౌత్ హీరోల గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండని తీవ్రంగా విమర్శించాడు.

Also Read : Allu Arjun : ప్రపంచాన్ని కాపాడబోతున్న బన్నీ.. అల్లు అర్జున్ – అట్లీ సినిమా కథ ఇదేనా..?

బాలీవుడ్ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. లైగర్ సినిమా ట్రైలర్ లాంచ్ చూసి నేను చాలా అప్సెట్ అయ్యాను. మన మీడియానే విజయ్ దేవరకొండని సూపర్ స్టార్ గా చూపించింది. సౌత్ కి వెళ్తే విజయ్ దేవరకొండ అక్కడ టైర్ 2 హీరో. అతను సూపర్ స్టార్ కాదు. మనలోనే ఒక జర్నలిస్ట్ మన దగ్గర సల్మాన్ ఖాన్ ఉంటే అక్కడ విజయ్ దేవరకొండ ఉన్నాడు అని అన్నారు. విజయ్ ఒక పన్నెండు సినిమాలు తీస్తే అందులో 9 ఫ్లాప్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఇంకో సినిమా ఏదో హిట్స్ ఉన్నాయి అంతే.

కేవలం తెలుగులో ఒక ఆరు నుంచి ఏడుగురు సూపర్ స్టార్స్ ఉన్నారు అంతే. లైగర్ రిలీజయినప్పుడు మన మీడియా విజయ్ ని దేవుడిలా ట్రీట్ చేసారు. ఆ సినిమా కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పారు. ఎంత కలెక్ట్ చేసింది కేవలం 5 కోట్లు. ఎందుకంటే ఎవ్వరూ విజయ్ దేవరకొండని పట్టించుకోలేదు. ఇక్కడ పీఆర్ లు విజయ్ దేవరకొండ ఒక పెద్ద బ్రాండ్, స్టార్ లా చూపించారు. లైగర్ సినిమా ఫుల్ రన్ లో కేవలం 20 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటి అతన్ని సల్మాన్ తో కంపేర్ చేస్తున్నారు. సల్మాన్ ఫ్లాప్ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ ఫైర్ అయ్యాడు.

 

దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పలువురు విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతన్ని తిడుతుంటే కొంతమంది నెటిజన్లు మాత్రం అతనికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ త్వరలో కింగ్డమ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : Vassishta : పాపం అంతమంది హీరోలతో సినిమాలు ఆగిపోయి.. ఆఖరికి రాజ్ తరుణ్ కథతో కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ మార్చమనడంతో..