Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సినిమా టైటిల్ కోసం పోటీ పడుతున్న నిర్మాణ సంస్థలు..

ఇప్పుడు కొన్ని నిర్మాణ సంస్థలు ఆపరేషన్‌ సిందూర్‌ అనే టైటిల్ కోసం పోటీపడుతున్నారట.

Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సినిమా టైటిల్ కోసం పోటీ పడుతున్న నిర్మాణ సంస్థలు..

Bollywood Production Houses Trying for Operation Sindoor Movie Title

Updated On : May 8, 2025 / 4:07 PM IST

Operation Sindoor : ప్రస్తుతం భారతదేశం అంతా ఆపరేషన్‌ సిందూర్‌ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడికి గట్టిగా సమాధానమిస్తూ భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. దీంతో సోషల్ మీడియాలో, బయట ఆపరేషన్‌ సిందూర్‌ అనే పేరు బాగా వైరల్ అయింది.

అయితే ఇలాంటి ఉగ్రదాడులు, దానికి కౌంటర్ అటాక్స్ జరిగిన కథలను తీసుకొని సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ తో అనేక సినిమాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు కొన్ని నిర్మాణ సంస్థలు ఆపరేషన్‌ సిందూర్‌ అనే టైటిల్ కోసం పోటీపడుతున్నారట.

Also See : Soniya Singh : అరుణాచలంలో ప్రియుడితో కలిసి గిరి ప్రదక్షణ చేసిన నటి సోనియా సింగ్..

ఆపరేషన్‌ సిందూర్‌ అనే సినిమా టైటిల్ కోసం దాదాపు 15 సినిమా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని బాలీవుడ్ సమాచారం. ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌లో ఇప్పటికే పలువురు నిర్మాతలు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారట. ఇందులో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు టీ సిరీస్‌, జీ స్టూడియోస్‌ కూడా ఉన్నాయట. మరి ఆపరేషన్‌ సిందూర్‌ టైటిల్ ఎవరికీ దక్కుతుందో, ఈ రియల్ ఇన్సిడెంట్స్ తో ఎవరు సినిమా తీస్తారో చూడాలి.

Also Read : Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ‘బుక్ మై షో’.. ఎప్పుడో తెలుసా?