Virosh
Virosh : విజయ్ – రష్మిక ఫిబ్రవరి 16న పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. విజయ్ తెలుగువాడే. రష్మిక కన్నడ అమ్మాయి అయినా తెలుగుతోనే ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ కి కూడా వెళ్ళింది. కానీ ఈ ఇద్దరి పెళ్లి తెలుగు మీడియాలో కంటే బాలీవుడ్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
విజయ్ – రష్మిక పెళ్లి అధికారికంగా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఉదయ్ పూర్ కి వెళ్లడం, అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే స్టోరీలు, వాళ్ళు ఉండే హోటల్, ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో విజయ్ పెళ్ళికి ఎవరెవరు వస్తున్నారు.. ఇలా అన్నిటిని బాలీవుడ్ మీడియా కవర్ చేస్తుంది. మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కొన్ని బాలీవుడ్ పేజీలు విజయ్ – రష్మిక పెళ్లి గురించి గంటకో పోస్ట్, గంటకో ఆర్టికల్ రాస్తూ తెగ ప్రమోషన్స్ చేస్తున్నారు.
Also Read : Shivani Nagaram : తిరుమల దర్శనం వివాదం.. మీరు కూడా చేసుకోవచ్చు అంటూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
తాజాగా ఉదయ్ పూర్ లో కొంతమంది బాలీవుడ్ మీడియాకు విజయ్ – రష్మిక స్పెషల్ ట్రీట్ ఇచ్చారట. దానికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది. అలాగే తమ పెళ్లిని ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ లో ఒక పీఆర్ ని కూడా పెట్టుకున్నారని సమాచారం. రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో దూసుకుపోతుంది. విజయ్ గతంలో బాలీవుడ్ లో సినిమా చేసి భంగపడ్డాడు. మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి బాలీవుడ్ అవసరం ఉంది. ఇవి దృష్టిలో పెట్టుకొని వారి బాలీవుడ్ మార్కెట్ కోసం ఈ పెళ్లిని బాగా ప్రమోట్ చేయిస్తున్నారని సమాచారం.
ఇక కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థకు అయితే ఉదయ్ పూర్ లో విజయ్ – రష్మిక పెళ్లి జరిగే హోటల్ దగ్గర్లోనే వేరే హోటల్స్ లో రూమ్స్ తీసుకొని అన్ని కవర్ చేయడానికి, అక్కడి సంగతులు లీక్ చేయడానికి కూడా వెళ్లరట. తెలుగు మీడియా, సోషల్ మీడియా పేజీలను మించి బాలీవుడ్ వీళ్ళ పెళ్లిని తెగ ప్రమోట్ చేస్తుంది ఎందుకు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇపుడు మీడియాకు ట్రీట్ ఇచ్చిన విషయం తెలియడంతో ఇదా సంగతి అని అనుకుంటున్నారు. మొత్తానికి విజయ్ – రష్మిక తమ పెళ్లిని బాలీవుడ్ మైలేజ్ కోసం బాగానే వాడుకుంటున్నారు అని అంటున్నారు.