Satish Kaushik : ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్.. సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్న స్టార్ సెలబ్రిటీలు..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణించారు. 67 ఏళ్ళ ఈ నటుడు గుండెపోటుతో హఠాత్తుగా బుధవారం రాత్రి మరణించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది................

Bollywood star Actor Director Satish Kaushik Passes away at the age of 67 with heart attack celebrities pays tributes
Satish Kaushik : ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు మరణిస్తూ తీరని విషాదాన్ని నింపుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణించారు. 67 ఏళ్ళ ఈ నటుడు గుండెపోటుతో హఠాత్తుగా బుధవారం రాత్రి మరణించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది.
సతీష్ కౌశిక్ దాదాపు 100 కి పైగా హిందీ సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. దాదాపు 20 సినిమాలను దర్శకుడిగా తెరకెక్కించారు. దర్శకుడిగా, ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకొని మంచి సినిమాలని ప్రేక్షకులకు అందించాడు. సతీష్ కౌశిక్ దర్శకుడిగా మొదటి సినిమా అనిల్ కపూర్, శ్రీదేవిలతో రూప్ కీ రాణి చోరోన్ కా రాజా సినిమాని తెరకెక్కించాడు. చివరగా కాగజ్ సినిమాని 2021లో తెరకెక్కించాడు. ఇక నటుడిగా చివరిసారి రకుల్ ప్రీత్ నటించిన ఛత్రివాలిలో కనిపించాడు. కంగనా సినిమా ఎమర్జెన్సీలో ఓ పాత్ర పోషించాడు. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు.
సతీష్ కౌశిక్ రెండు రోజుల క్రితం కూడా హోలీ వేడుకలను ఘనంగా చేసుకున్నాడు. ఆయన హఠాన్మరణంతో బాలీవుడ్ బాధలో మునిగిపోయింది. చాలా మంది స్టార్ సెలబ్రిటీలు సతీష్ కౌశిక్ కి సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సతీష్ తో ఉన్న ఫోటో షేర్ చేసి.. అందరూ మరణిస్తారని తెలుసు. కానీ నేను జీవించి ఉన్నప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ గురించి ఇలా రాస్తాననుకోలేదు. మా 45 ఏళ్ళ స్నేహం అర్దాంతరంగా ముగిసిపోయింది. సతీష్ లేకుండా నా జీవితం గతంలో లాగా ఉండదు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. కంగనా రనౌత్, మధుర్ భండార్కర్.. మరింతమంది పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! ??? pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
Woke up to this horrible news, he was my biggest cheerleader, a very successful actor and director #SatishKaushik ji personally was also a very kind and genuine man, I loved directing him in Emergency. He will be missed, Om Shanti ? pic.twitter.com/vwCp2PA64u
— Kangana Ranaut (@KanganaTeam) March 9, 2023