Nitin Desai : బాలీవుడ్ స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. షాక్ లో బాలీవుడ్..

తాజాగా బాలీవుడ్ స్టార్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్‌ ఆత్మహత్య చేసుకొని మరణించడం బాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది.

Nitin Chandrakant Desai :  ఇటీవల పలువురు సినీ ప్రముఖులు అకస్మాత్తుగా మరణించి పరిశ్రమలో విషాదం నింపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్‌ ఆత్మహత్య చేసుకొని మరణించడం బాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన నితిన్‌ దేశాయ్‌ నేడు తెల్లవారుజామున ముంబైలో ఉన్న తన ND స్టూడియోలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది.

1980లలో సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నితిన్‌ దేశాయ్‌ 1989లో పరిందా సినిమాతో ఆర్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి దాదాపు 100 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా, మరో 50 సినిమాలకు పైగా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు. నటుడిగా కూడా పలు సినిమాల్లో మెరిపించారు. దర్శకుడిగానూ రెండు సినిమాలు తెరకెక్కించారు నితిన్‌ దేశాయ్‌. నిర్మాతగా కూడా రెండు సినిమాలు తెరకెక్కించారు.

హమ్‌ దిల్‌ దే సనమ్‌, లగాన్‌, దేవదాస్‌, జోధా అక్బర్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్ పాయో, 1942 ఏ లవ్‌ స్టోరీ, ఫ్యాషన్‌, పాని పట్‌, దోస్తానా.. లాంటి ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలకు పనిచేసారు నితిన్‌ దేశాయ్‌. అనేక అవార్డులు కూడా అందుకున్నారు. అయితే కరోనా తర్వాత నుంచి ఆయన చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. స్టార్ హోదాలో ఉన్న ఆయన ఇలా 57 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్స్ నితిన్‌ దేశాయ్‌ మృతిపై దిగ్బ్రాంతి చెంది నివాళులు అర్పిస్తున్నారు..

Yadamma Raju : యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ ఎలా జరిగింది..? ఆపరేషన్‌లో కాలి వేలు తీసేశారు.. ఎమోషనల్ అయిన రాజు..

ఆత్మహత్య కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దానిపై కారణాలు ఇంకా తెలియలేదు. అయితే అప్పుల బాధతో, ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని పలువురు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు