Image Credits : Land Rover Modi Motors Worli Instagram
Bobby Deol : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ కొన్ని ఫ్లాప్స్ రావడంతో కొన్నాళ్ళు కనుమరుగయ్యారు. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో తన భార్య సంపాదనతోనే బతికారు. రీ ఎంట్రీలో అడపడదడపా సినిమాలు చేస్తున్న బాబీ డియోల్ యానిమల్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు.
అక్కడ్నుంచి విలన్ గా వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ తన క్యారెక్టర్స్ కి పేరు తెచ్చుకుంటున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్ లో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు బాబీ డియోల్. అయితే హీరోగా కెరీర్ అయ్యాక భార్య సంపాదన మీద బతికిన ఈ బాలీవుడ్ స్టార్ ఇప్పుడు సక్సెస్ లో ఉండటంతో ఖరీదైన కార్ కొన్నాడు.
Also Read : Pooja Hegde : పూజ హెగ్డే తాతయ్య నేషనల్ లెవల్ అథ్లెట్ అని తెలుసా? ఆ రికార్డు కూడా పూజ తాతయ్య పేరు మీదే..
ఇటీవల రెండు రోజుల క్రితం బాబీ డియోల్ రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ 2 కార్ ని కొన్నారు. బాబీ డియోల్ కార్ కొనుగోలు చేసిన ఫోటోలను కార్ కంపెనీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కార్ ఖరీదు దాదాపు 3 కోట్ల రూపాయలు. బాబీ డియోల్ 3 కోట్ల కార్ కొన్నాడని తెలిసి ఆశ్చర్యపోతున్నారు అతని ఫ్యాన్స్. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే సక్సెస్ అయి సంపాదిస్తున్నారు బాబీ డియోల్ అని అంటున్నారు.
Also Read : Thaman : మరీ ఇంత కాఫీ పిచ్చి ఏంటి భయ్యా..? ప్రపంచంలో ఉండే అన్ని కాఫీ బీన్స్.. 15 కాఫీ మిషన్స్..