Thaman : మరీ ఇంత కాఫీ పిచ్చి ఏంటి భయ్యా..? ప్రపంచంలో ఉండే అన్ని కాఫీ బీన్స్.. 15 కాఫీ మిషన్స్..
షూ కలెక్షన్ తో పాటు తమన్ దగ్గర కాఫీ కలెక్షన్ కూడా ఉందట.

Do You Know about Music Director Thaman Coffee Collection
Thaman : కొంతమందికి రకరకాల కలెక్షన్ అంటే ఇష్టం ఉంటుంది. అది కొందరికి అలవాటుగా కూడా మారుతుంది. మన సెలబ్రిటీలు కూడా కొంతమంది వాచ్ లు, షూలు, హ్యాండ్ బ్యాగ్స్.. ఇలా ఎవరికి నచ్చినవి వాళ్ళు రెగ్యులర్ గా కొనుక్కుంటూ కలెక్షన్ మెయింటైన్ చేస్తారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి షూస్ పిచ్చి అని అందరికి తెలిసిందే.
తమన్ దగ్గర దాదాపు 300 పెయిర్స్ షూస్ ఉన్నాయి. బయటకి వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక్కో షూ వేసుకొస్తారు. అయితే షూ కలెక్షన్ తో పాటు తమన్ దగ్గర కాఫీ కలెక్షన్ కూడా ఉందట.
Also Read : RGV : ఆర్జీవీ సిండికేట్ సినిమాలో ఆ స్టార్ హీరో.. ఇలాంటి టైంలో ఆ హీరో ఆర్జీవీతో సినిమా చేస్తాడా?
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ తన కాఫీ కలెక్షన్ గురించి మాట్లాడుతూ.. వరల్డ్ వైడ్ దొరికే అన్ని కాఫీ బీన్స్ నా దగ్గర ఉన్నాయి. కాఫీలో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. నా స్టూడియోలోనే ఒక 15 కాఫీ మిషన్స్ ఉన్నాయి. కాఫీలతో ప్రయోగాలు చేస్తాను. ఆస్ట్రేలియా, జపనీస్.. రకరకాల దేశాల కాఫీలు ఉంటాయి నా దగ్గర. రీసెంట్ గానే మష్రూమ్ కాఫీ వస్తే తెప్పించాను అని తెలిపారు. అలాగే తమన్ రోజంతా కాఫీ తాగుతూనే ఉండగలను అని చెప్పాడు. తమన్ కి కాఫీ అంటే మరీ ఇంత ఇష్టమా, ప్రపంచంలో దొరికే కాఫీలు అన్ని తెప్పించుకొని తాగుతాడా అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read : SS Thaman : ఇదేం ట్యాలెంట్ బ్రో.. పైలెట్స్ నన్ను మోసం చేయలేరు.. ఆసక్తికర విషయం చెప్పిన తమన్..