SS Thaman : ఇదేం ట్యాలెంట్ బ్రో.. పైలెట్స్ నన్ను మోసం చేయలేరు.. ఆసక్తికర విషయం చెప్పిన తమన్..
తమన్ తాజాగా యాంకర్ సుమకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Music Director Thaman Says Interesting Thing Regarding Flight Travel
SS Thaman : డ్రమ్మర్ గా కెరీర్ మొదలుపెట్టిన తమన్ ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో సగం సినిమాలు ఈయనే చేస్తున్నాడు. ఫుల్ బిజీగా ఉన్న తమన్ తాజాగా యాంకర్ సుమకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.
సాధారణంగా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ రికార్డింగ్స్ చెన్నైలోనే పెట్టుకుంటారు. తమన్ కూడా అప్పుడప్పుడు సాంగ్స్ రికార్డింగ్స్ చెన్నైలో పెట్టుకుంటాడు. దీంతో రెగ్యులర్ గా చెన్నై వెళ్లి వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తనకు ఫ్లైట్ రూట్స్ గుర్తుంటాయి అని చెప్పుకొచ్చాడు.
Also Read : OG Song : పవన్ OG ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన తమన్.. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో కూడా చెప్పి..
తమన్ మాట్లాడుతూ.. నేను ఫ్లైట్ లో కూడా నిద్రపోను. నాకు ఫ్లైట్ రూట్స్ కూడా గుర్తుంటాయి. నేను రెగ్యులర్ గా హైదరాబాద్ టు చెన్నై వెళ్తాను. హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాక 16 నిముషాలలో కృష్ణా నది వస్తుంది. ఆ తర్వాత పెన్నా నది, ఆ తర్వాత కొన్ని కొండలు వస్తాయి. తర్వాత చెన్నై. నన్ను పైలెట్స్ మోసం చేయలేరు. అలాగే భయం కూడా ఉంటుంది. పైలెట్ సరిగ్గా తోలుతున్నాడో లేదో భయం వేస్తుంది. అందుకే ఫ్లైట్ లో జాగ్రత్తగా ఉండి రూట్ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారి రూట్ తప్పి వేరే రూట్ లోకి వెళ్ళింది. నేను మా టీం వాళ్లకు రూట్ మారింది చెన్నై తీసుకెళ్లట్లేదేమో అని చెప్తే వాళ్ళు కాదు చెన్నై వెళ్ళిపోతాం అన్నారు. తర్వాత క్లౌడ్స్ ఉండటం వల్ల ఫ్లైట్ ని బెంగళూరుకు తీసుకెళ్లి ల్యాండ్ చేసారు అని చెప్పారు. నాకు రూట్ మారిస్తే తెలిసిపోతుంది అని చెప్పుకొచ్చాడు.
దీంతో అందరూ రోడ్ రూట్స్ గుర్తుకుపెట్టుకుంటే తమన్ ఇలా ఫ్లైట్ రూట్స్ కూడా గుర్తుకుపెట్టుకోవడం ఏంటో బ్రో అని తమన్ ట్యాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Thaman : వామ్మో.. తమన్ దగ్గర అన్ని షూ పెయిర్స్ ఉన్నాయా..? తమన్ దగ్గర ఉన్న ఖరీదైన షూ ఎన్ని లక్షలో తెలుసా?