Thaman : వామ్మో.. తమన్ దగ్గర అన్ని షూ పెయిర్స్ ఉన్నాయా..? తమన్ దగ్గర ఉన్న ఖరీదైన షూ ఎన్ని లక్షలో తెలుసా?

తమన్ రోజుకొక కొత్త షూస్ వేసుకుంటాడు. బయట ఎక్కడ, ఏ ఈవెంట్లో కనపడినా తమన్ షూస్ హైలెట్ అవుతాయి.

Thaman : వామ్మో.. తమన్ దగ్గర అన్ని షూ పెయిర్స్ ఉన్నాయా..? తమన్ దగ్గర ఉన్న ఖరీదైన షూ ఎన్ని లక్షలో తెలుసా?

Do You Know about Music Director SS Thaman Shoes Collection

Updated On : April 15, 2025 / 8:12 PM IST

Thaman : డ్రమ్మర్ గా కెరీర్ మొదలుపెట్టిన తమన్ ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. పెద్ద సినిమాల్లో సగం తమనే చేస్తున్నాడు. తన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు తమన్. అయితే తమన్ కి కొత్త షూస్ అంటే ఇష్టమని అందరికి తెలిసిందే.

తమన్ రోజుకొక కొత్త షూస్ వేసుకుంటాడు. బయట ఎక్కడ, ఏ ఈవెంట్లో కనపడినా తమన్ షూస్ హైలెట్ అవుతాయి. తమన్ కూడా తనకి షూస్ అంటే ఇష్టం అని, రెగ్యులర్ గా కొంటాను అని పలుమార్లు చెప్పాడు. తమన్ వేసుకునే కొత్త కొత్త షూస్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తన దగ్గరున్న ఖరీదైన షూల గురించి, తన దగ్గరున్న షూ పెయిర్స్ నంబర్ గురించి చెప్పాడు. అవి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Also Read : Thaman – Game Changer : 140 కోట్ల లాస్.. ‘గేమ్ ఛేంజర్’ పై కావాలని చేసారు.. తమన్ వ్యాఖ్యలు వైరల్..

తమన్ తన షూ కలెక్షన్ గురించి మాట్లాడుతూ.. నా దగ్గర దాదాపు 300 షూ పెయిర్స్ ఉన్నాయి. ఎక్కువగా హెవీ వెయిట్ ఉన్న షూస్ వేస్తాను. నా దగ్గర ఉన్న ఖరీదైన షూ అంటే బ్యాలెన్స్ అనే కంపెనీ షూ ఉంది. దాని ఖరీదు మూడు లక్షల రూపాయలు. అవి వాడట్లేదు. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను వాటిని. మురికి లేని ప్లేస్ కి వెళ్ళినప్పుడు వేసుకోవాలి అని ఎదురుచూస్తున్నాను. నా షూస్ నేనే క్లీన్ చేసుకుంటాను, ఎవర్ని నా షూస్ ముట్టుకోనివ్వను. స్ట్రెస్ లో ఉన్నప్పుడు షూస్ క్లీన్ చేసుకుంటాను అని తెలిపారు.

Also Read : Sumaya Reddy : నిర్మాతగా మారి తనని హీరోయిన్ గా పరిచయం చేసుకుంటున్న తెలుగమ్మాయి..