Thaman – Game Changer : 140 కోట్ల లాస్.. ‘గేమ్ ఛేంజర్’ పై కావాలని చేసారు.. తమన్ వ్యాఖ్యలు వైరల్..

గేమ్ ఛేంజర్ సినిమా మీద వచ్చిన నెగిటివిటీకి స్పందిస్తూ తమన్..

Thaman – Game Changer : 140 కోట్ల లాస్.. ‘గేమ్ ఛేంజర్’ పై కావాలని చేసారు.. తమన్ వ్యాఖ్యలు వైరల్..

Thaman Sensational Comments on Ram Charan Game Changer Movie Negativity

Updated On : April 15, 2025 / 7:44 PM IST

Thaman – Game Changer : సంక్రాంతికి రిలీజయిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై కొంతమంది చాలా నెగిటివిటీ చేసిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ ముందు నుంచే కొంతమంది కావాలని సినిమాని నెగిటివ్ చేసి, పైరసీ చేసి, బెదిరించి.. ఇలా రకరకాలు చేసారు. అప్పట్లో గేమ్ ఛేంజర్ ఇష్యూ సంచలనంగానే మారింది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు.

అయితే గేమ్ ఛేంజర్ సినిమా మీద వచ్చిన నెగిటివిటీకి స్పందిస్తూ తమన్ డాకు మహారాజు సక్సెస్ ఈవెంట్లో ఎమోషనల్ అయి మాట్లాడారు. సినిమాని చంపకండి, నిర్మాతలను బతకనివ్వండి అంటూ ఫైర్ అయ్యారు. దీంతో ఆ స్పీచ్ వైరల్ గా మారింది. దానిపై చిరంజీవి కూడా స్పందించారు. తాజాగా తమన్ యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో అప్పుడు ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు అని అడిగింది సుమ.

Also Read : Sumaya Reddy : నిర్మాతగా మారి తనని హీరోయిన్ గా పరిచయం చేసుకుంటున్న తెలుగమ్మాయి..

దానికి తమన్ స్పందిస్తూ.. దిల్ రాజు గారు అంత బాధపడటం నేను ఎప్పుడూ చూడలేదు. సినిమా రిలీజయ్యేటప్పుడే ఆయనకు టార్చర్ చూపించారు. ఇది నాలుగేళ్ల క్రితం సినిమా అని అన్నారు. సినిమా లేట్ అవ్వడం అనేది పరిస్థితులను బట్టి జరుగుతుంది. ఏ నిర్మాత తన సినిమాని చంపుకోడు. అది జరిగినప్పుడు ఎవరూ వచ్చి సపోర్ట్ గా నిల్చోలేదని నా బాధ. ఆ సమయానికి అందరు ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేసి ఉంటే బాగుండు. సినిమా పైరసి రావడం, బయట ప్లే చేయడం, బస్సుల్లో ప్లే చేయడం.. ఇదంతా కావాలని చేసినట్టు అనిపించింది.

ట్విట్టర్లో కూడా చాలా నెగిటివ్ చూపించారు ఆ సినిమాపై. 140 కోట్లు లాస్ అనేది ఒక నిర్మాతకు చాలా పెద్ద కష్టం. దిల్ రాజు గారు చాలా మంచి మనిషి. అలాంటి ఆయనకు అలా జరగడం బాగోలేదు. దిల్ రాజు గారు శంకర్ తో, చరణ్ తో సినిమా చేసి 1000 కోట్లు సినిమా చేయాలని అనుకున్నారు. సినిమా బాగోలేకపోతే అదే చనిపోద్ది. మనం నెగిటివ్ చేయకూడదు. అందుకే అలా మాట్లాడాను. పైరసీకి వ్యతిరేకంగా టాలీవుడ్ అందరూ, అందరి హీరోల ఫ్యాన్స్ నిలబడాలి అని అన్నారు. దీంతో మరోసారి గేమ్ ఛేంజర్ గురించి తమన్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Varanasi Soumya : మెట్లపై నుంచి జారి పడే సీన్.. నిజంగానే జారి పడ్డ మేఘ సందేశం సీరియల్ నటి.. ప్రోమో వైరల్..