Sumaya Reddy : నిర్మాతగా మారి తనని హీరోయిన్ గా పరిచయం చేసుకుంటున్న తెలుగమ్మాయి..
సుమయ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Dear Uma Heroine Sumaya Reddy Tells about her Movie Struggles
Sumaya Reddy : తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా తెరకెక్కిస్తున్న సినిమా ‘డియర్ ఉమ’. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది. పృథ్వీ అంబర్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా సుమయ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
డియర్ ఉమ సినిమా గురించి చెప్తూ.. కరోనా సమయంలో నాకు ప్రతీ రోజూ ఓ కల వచ్చేది. అది నన్ను వెంటాడుతూ ఉన్నట్టు అనిపించింది. అలా కలలో వచ్చిన పాయింట్ మీదే కథ రాసుకున్నాను. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే సంఘటనలు చూపించబోతున్నాం. డాక్టర్లు, పేషెంట్స్‌కి మధ్యలో ఉండే పర్సన్స్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో చూపిస్తున్నాం. ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. కాస్త ఫిక్షనల్. కాస్త రియల్. వైద్యరంగం మీద అందరికి అవగాహన రావాలి అనే ఈ సినిమాని తీస్తున్నాను అని తెలిపారు.
Also Read : Varanasi Soumya : మెట్లపై నుంచి జారి పడే సీన్.. నిజంగానే జారి పడ్డ మేఘ సందేశం సీరియల్ నటి.. ప్రోమో వైరల్..
సుమయ రెడ్డి తన గురించి చెప్తూ.. అనంతపూర్ నుంచి వచ్చాను. ఏవియేషన్ చేస్తూనే మోడలింగ్ చేశాను. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. హీరోయిన్ గా ట్రై చేశాను కానీ అవకాశాలు రాలేదు. దాంతో నేనే నిర్మాతగా మారి నేను రాసిన కథని తెరకెక్కించాలని అనుకున్నాను. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నాను. మొదట్లో సినిమాలు చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నాను కానీ చాలా కష్టం. నటించడం ఈజీనే కానీ నిర్మాతగానే కష్టం అని తెలిపింది.
అలాగే.. డియర్ ఉమ సినిమాకి అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగింది. టెక్నిషియన్స్ ని పెద్దవాళ్ళని తీసుకోవడంతో బడ్జెట్ పెరిగింది. నటించడం చాలా సులభం. నిర్మాతగా ఉండటం చాలా కష్టం. ఒక్కోసారి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నామో కూడా తెలీదు. కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అలా వెళ్తుంటే బాధగా ఉండేది. కానీ సినిమా మీద ప్యాషన్ తోనే సినిమా నిర్మించాను. ఇకముందు కూడా నిర్మాతగా సినిమాలు చేస్తాను, హీరోయిన్ గా సినిమాలు చేస్తాను. ఆల్రెడీ ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని తెలిపింది సుమయ రెడ్డి.
Also Read : MS Dhoni : ధోని బాలీవుడ్ ఎంట్రీ.. లవ్ స్టోరీతో.. కరణ్ జోహార్ పోస్ట్ వైరల్..
ఒక తెలుగమ్మాయి ధైర్యం చేసి, హీరోయిన్ గా నటిస్తూ, నిర్మాతగా మారి, ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాని చేసి మీ ముందుకు వస్తున్నాను సపోర్ట్ చేయండి అంటూ మాట్లాడారు సుమయ రెడ్డి. మరి డియర్ ఉమ సినిమా ఎలా ఉంటుందో ఏప్రిల్ 18 చూడాలి.