MS Dhoni : ధోని బాలీవుడ్ ఎంట్రీ.. లవ్ స్టోరీతో.. కరణ్ జోహార్ పోస్ట్ వైరల్..
తాజాగా బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ఓ వీడియోని షేర్ చేసారు.

Karan Johar Shares Interesting Video of MS Dhoni Netizens Think Dhoni will entry in Bollywood
MS Dhoni : క్రికెటర్లు పలువురు ఇప్పటికే సినిమాల్లో కనిపించారు. యాడ్స్, షోలలో అయితే ఎక్కువగా కనిపిస్తారు. అయితే మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అని సందేహం వస్తుంది. ఇప్పటికే ధోని నిర్మాతగా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు నటుడిగా మారబోతున్నాడా అనే డౌట్ వస్తుంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ఓ వీడియోని షేర్ చేసారు. ఈ వీడియోలో ధోని నటించబోతున్నాడు, ఓ కొత్త రొమాంటిక్ అవతారంలో కనపడబోతున్నాడు అని ఉంది. ధోని హార్ట్ సింబల్ బెలూన్ పట్టుకొని కనపడ్డాడు. ఆ వీడియో చూసిన తర్వాత ధోని హీరోగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా అని సందేహం కలుగుతుంది. అది కూడా కరణ్ జోహార్ షేర్ చేయడంతో కొంతమంది కరణ్ ధోనిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడేమో అని అంటున్నారు.
Also Read : Nag Ashwin : ఆ సినిమా ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన స్టార్ డైరెక్టర్.. సినిమా పెద్ద హిట్..
అయితే ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో ఈ వీడియో ఒక యాడ్ కోసం ఏమో, ఆ యాడ్ ని కరణ్ జోహార్ డైరెక్ట్ చేసాడేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ స్పెషల్ వీడియో ధోని యాడ్ కోసమా? బాలీవుడ్ ఎంట్రీ కోసమా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.