Director Vassishta : వామ్మో.. విశ్వంభర డైరెక్టర్ లైనప్ అదిరిందిగా.. మెగా, నందమూరి ఫ్యామిలీలను చేతిలో పెట్టుకొని..

వశిష్ట ఆల్రెడీ కొంతమంది హీరోలకు కథలు చెప్పి ఉంచాడట. లైనప్ భారీగానే ప్లాన్ చేసుకుంటున్నాడట వశిష్ట.

Director Vassishta : వామ్మో.. విశ్వంభర డైరెక్టర్ లైనప్ అదిరిందిగా.. మెగా, నందమూరి ఫ్యామిలీలను చేతిలో పెట్టుకొని..

After Chiranjeevi Vihwambhara Movie Director Vassishta Lineup with Mega and Nandamuri Heros

Updated On : April 15, 2025 / 1:55 PM IST

Director Vassishta : డైరెక్టర్ వశిష్ట మొదటి సినిమా బింబిసారతోనే భారీ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా రెండో సినిమాని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత వశిష్ట ఆల్రెడీ కొంతమంది హీరోలకు కథలు చెప్పి ఉంచాడట. లైనప్ భారీగానే ప్లాన్ చేసుకుంటున్నాడట వశిష్ట.

వశిష్ట తండ్రి, నిర్మాత మల్లిడి సత్యనారాయణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వశిష్ట నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు.

Also Read : Pawan Kalyan : మూగ జీవాల కోసం పవన్ కళ్యాణ్ మంచిపని.. రాష్ట్ర వ్యాప్తంగా..

నిర్మాత మల్లిడి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆల్రెడీ బాలకృష్ణ గారికి కథ చెప్పారు. ఆయన కూడా ఓకే అన్నారు. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి తర్వాత చేయొచ్చు అని చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ కి కూడా ఓ కథ చెప్పి ఉంచాడు. అల్లు అర్జున్ పిలిచి కథ చెప్పమన్నాడు. నేనే ప్రస్తుతం వద్దు అన్నాను. బింబిసార చూసి అల్లు అర్జున్ సినిమా బాగా చేసాడు మీ అబ్బాయి, ఫ్యూచర్ లో చేద్దాం, కథ రెడీ చేసుకొమ్మని చెప్పు అన్నాడని తెలిపారు.

దీంతో వశిష్ట ఆల్రెడీ బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ కూడా ఓకే చెప్తే అది కూడా చేతిలో ఉంటుంది. ఇక అల్లు అర్జున్ ఎలాగో ఆఫర్ ఇచ్చాడు. ఇలా మొత్తం మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలను చేతిలో పెట్టుకొని తన సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు వశిష్ట. అయితే ఇవన్నీ కూడా సోషియో ఫాంటసీ జానర్ అని వశిష్ట తండ్రి తెలిపారు.

Also Read : Pawan Kalyan : పాలిటిక్స్ లో పవన్ బిజీ.. ఆ బాధ్యతలు తీసుకోబోతున్న చిరంజీవి, చరణ్..? ఫ్యాన్స్ కి పండగే..