Pawan Kalyan : పాలిటిక్స్ లో పవన్ బిజీ.. ఆ బాధ్యతలు తీసుకోబోతున్న చిరంజీవి, చరణ్..? ఫ్యాన్స్ కి పండగే..

పవన్ బిజీ వల్ల ఇదివరకే ఒప్పందం చేసుకొని చేస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Pawan Kalyan : పాలిటిక్స్ లో పవన్ బిజీ.. ఆ బాధ్యతలు తీసుకోబోతున్న చిరంజీవి, చరణ్..? ఫ్యాన్స్ కి పండగే..

Ram Charan and Megastar Chiranjeevi coming for Pawan Kalyan Harihara Veeramallu

Updated On : April 14, 2025 / 6:56 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా నిత్యం కీలక సమీక్షలు, సమావేశాలు, ఆ తర్వాత జిల్లాల పర్యటనలు, ప్రజలతో మమేకం అవటం… ఇలా క్షణం తీరిక లేకుండా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. దీంతో సినిమాలు చేసేందుకు టైమ్ దొరకడంలేదు. కొత్త సినిమాలు కాకపోయిన గతంలోనే ఒప్పందాలు చేసుకున్న సినిమాల్లో కూడా నటించేందుకు సమయం దొరకడంలేదు.

పవన్ బిజీ వల్ల ఇదివరకే ఒప్పందం చేసుకొని చేస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. OG సంగతేమో కానీ పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మే9 న రిలీజ్ పక్కా అంటూ నిర్మాతలు పోస్టర్స్ వేస్తునే ఉన్నారు. అంతే కాదు డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిందని క్లారిటీ ఇచ్చారు. పవన్ ఓ వారం రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందని, దాంతో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని చిత్ర యూనిట్ చెప్తోంది. కానీ పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా అని సినిమా యూనిట్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారట.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ టైర్ 2 హీరో.. దేవుడిలా ట్రీట్ చేసారు.. బాలీవుడ్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..

రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ కు పవన్ రావటం కష్టమే అన్న టాక్ నడుస్తోంది. ఒక వైపు సినిమా షూటింగ్, మరో వైపు ప్రమోషన్స్ పవన్ చేసే అవకాశాలు తక్కువే అని సమాచారం. పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, అబ్బాయి రామ్ చరణ్ రంగంలోకి దిగబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కేవలం హీరోయిన్ నిధి అగర్వాల్ తోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మూవీ యూనిట్.

హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ కు రామ్ చరణ్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఛాన్స్ ఉందట. ట్రైలర్ లాంచ్ కి పవన్ రారని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం వస్తారని సమాచారం. పవన్ పాలిటీక్స్ పరంగా బిజిగా ఉండటంతో ప్రమోషన్స్ బాధ్యత చిరు, చరణ్ తీసుకున్నారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇదే కనక నిజమైతే పవన్ లేకపోయినా చరణ్, చిరంజీవి, మెగా హీరోలను పవన్ సినిమా ప్రమోషన్స్ లో చూడొచ్చు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Allu Arjun : ప్రపంచాన్ని కాపాడబోతున్న బన్నీ.. అల్లు అర్జున్ – అట్లీ సినిమా కథ ఇదేనా..?