Pawan Kalyan : మూగ జీవాల కోసం పవన్ కళ్యాణ్ మంచిపని.. రాష్ట్ర వ్యాప్తంగా..

తాజాగా పవన్ కళ్యాణ్ తన పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మూగ జీవాల కోసం ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు.

Pawan Kalyan : మూగ జీవాల కోసం పవన్ కళ్యాణ్ మంచిపని.. రాష్ట్ర వ్యాప్తంగా..

AP Deputy CM Pawan Kalyan Started New Work for Animals

Updated On : April 15, 2025 / 1:33 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా తన అధీనంలో ఉన్న శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా పంచాయితీ రాజ్ శాఖతో గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటివి ఏర్పాటు చేస్తూ పల్లె అభివృద్ధికి తోడ్పడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మూగ జీవాల కోసం ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు.

పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా, రైతాంగానికి భరోసా కల్పించేలా ఇప్పటికే నిర్మించిన గోకులాలకు కొనసాగింపుగా, మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 60 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ఏప్రిల్ నెల ఆఖరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read : AP Cabinet: చంద్రబాబు నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ భేటీ.. ఈ అంశాలపై చర్చ..

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి కనీసం ఒక నీటి తొట్టె ఏర్పాటు చేయబడుతోంది. ఇది మూగజీవాలకు తాగునీటి అందుబాటును కల్పించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. పశుపోషణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడనుంది.

మూగ జీవాల కోసం పవన్ కళ్యాణ్ ఈ మంచిపనికి శ్రీకారం చుట్టడంతో ఫ్యాన్స్, కార్యకర్తలతో పాటు పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తూ పవన్ ని అభినందిస్తున్నారు.

Also Read : Allu Arjun : పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా