Allu Arjun : పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా
బన్నీ ఆయన భార్య స్నేహ పవన్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

Allu Arjun : హైదరాబాద్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ వెంట ఆయన భార్య స్నేహ కూడా ఉన్నారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బన్నీ ఆయన భార్య స్నేహ పవన్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం.
Also Read : పాలిటిక్స్ లో పవన్ బిజీ.. ఆ బాధ్యతలు తీసుకోబోతున్న చిరంజీవి, చరణ్..? ఫ్యాన్స్ కి పండగే..
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కూతురు పొలెనా అంజనా పవనోవాలను తనతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చేశారు పవన్ కల్యాణ్.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here