AP Cabinet: చంద్రబాబు నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ భేటీ.. ఈ అంశాలపై చర్చ..
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. దాదాపు 24 అజెండాలోని అంశాలపై మంత్రివర్గ చర్చించనుంది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరగనుంది.
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మంత్రివర్గంలో చర్చించి తుదినిర్ణయం తీసుకోనుంది. సీఆర్డీఏ 46 ఆధారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్లకు ఆమోద ముద్ర వేయనుంది. ఎల్ వన్ గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది.
పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్సైపీబీ) 5వ సమావేశం నిర్ణయాలను ఆమోదించనుంది. రూ.30,667 కోట్ల పెట్టుబలతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల ఎస్ఐపీబీలో నిర్ణయం తీసుకున్నారు.
Also Read: నిరుద్యోగులు సిద్ధంగా ఉండండి.. తెలంగాణలో ఈ నెలలోనే 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
వీటి ద్వారా 32,133 ఉద్యోగాలు వస్తాయని అంచనా ఉంది. శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి గుంటూరు, చిత్తూరు కడప అనంతపురం ఉమ్మడి జిల్లాలో సీనరేజీ ఫీజు వసూలు కాంట్రాక్టు గడువు పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. విశాఖ ఐటీ హిల్స్ లో టీసీఎస్ కు 21.66 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చేందుకు అంగీకారం తెలపనుంది.
టీసీఎస్ ఏర్పాటు ద్వారా రూ.1370 కోట్ల మేర పెట్టుబడులు రావటంతో పాటు 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా ఉంది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖ ఐటీ హిల్ లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56 ఎకరాల కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనుంది. 3 జిల్లాల్లో 199 వ్యవసాయ ఫీడర్ల ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ లకు ఆమోదం తెలపనుంది రాష్ట్ర మంత్రివర్గం. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.