Nag Ashwin : ఆ సినిమా ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన స్టార్ డైరెక్టర్.. సినిమా పెద్ద హిట్..

తాజాగా నాగ్ అశ్విన్ ఓ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు.

Nag Ashwin : ఆ సినిమా ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన స్టార్ డైరెక్టర్.. సినిమా పెద్ద హిట్..

Director Nag Ashwin says he went to Depression after watching a Movie Trailer

Updated On : April 15, 2025 / 3:16 PM IST

Nag Ashwin : తీసిన మూడు సినిమాలతోనే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయ్యాడు నాగ్ అశ్విన్. ఒక సినిమా మించి ఇంకో సినిమా పెద్ద హిట్ అయ్యాయి. ఇటీవల ప్రభాస్ తో కల్కి సినిమాతో మెప్పించగా ప్రస్తుతం కల్కి 2 సినిమా పనులతో బిజీగా ఉన్నాడు నాగ్ అశ్విన్.

తాజాగా నాగ్ అశ్విన్ ఓ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఈ క్రమంలో కొత్త కథలు రాయాలంటే కష్టం అనిపిస్తుందా అని అడిగారు.

Also Read : Director Vassishta : వామ్మో.. విశ్వంభర డైరెక్టర్ లైనప్ అదిరిందిగా.. మెగా, నందమూరి ఫ్యామిలీలను చేతిలో పెట్టుకొని..

దీనికి నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ.. అవును. నేను ఏదైనా ఒక కథ రాసుకుంటే కొన్ని నెలలకు అదే ఐడియా వేరే సినిమాలోనో, ట్రైలర్ లోనో కనిపిస్తుంది. 2008లో నేను జ్ఞాపకాలు, కలలు నేపథ్యంలో ఓ కథ రాసుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు అదే కాన్సెప్ట్ తో హాలీవుడ్ సినిమా ఇన్‌సెప్షన్‌ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళాను. అయినా సరే ఎప్పుడూ కొత్త కథలను రాసుకుంటాను. ఎక్కడా రాని పాయింట్ గురించే సినిమాలు తీయాలి అని అన్నారు.

కలలు నేపథ్యంలో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో 2010 లో వచ్చిన ఇన్‌సెప్షన్‌ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి ఆ సినిమా స్క్రీన్ ప్లే అర్ధం కాక పలుమార్లు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హాలీవుడ్ సినిమాగా రిలీజయిన ఇన్‌సెప్షన్‌ అన్ని దేశాల్లోనూ మంచి విజయం సాధించింది.

Also Read : Pawan Kalyan : మూగ జీవాల కోసం పవన్ కళ్యాణ్ మంచిపని.. రాష్ట్ర వ్యాప్తంగా..