OG Song : పవన్ OG ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన తమన్.. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో కూడా చెప్పి..
తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమాలో సాంగ్స్ గురించి, ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలిపాడు.

Music Director Thaman Comments on OG Songs and Revealed about First Song Release
OG Song : సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు గ్లింప్స్ సినిమా మీద హైప్ బాగా పెంచేసాయి. పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా OG.. OG.. అని అరుస్తున్నారు. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు.
ఇంకా 20 రోజులు పవన్ OG సినిమాకు డేట్స్ ఇస్తే ఈ షూట్ పూర్తయిపోతుంది. ఇప్పటికే మూవీ యూనిట్ సాంగ్స్, కొంత షూట్, పవన్ లేని సీన్స్ షూట్ చేసేసారు. OG సినిమా గ్లింప్స్ కి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవడంతో తమన్ ని పవన్ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమాలో సాంగ్స్ గురించి, ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలిపాడు.
Also Read : Thaman : వామ్మో.. తమన్ దగ్గర అన్ని షూ పెయిర్స్ ఉన్నాయా..? తమన్ దగ్గర ఉన్న ఖరీదైన షూ ఎన్ని లక్షలో తెలుసా?
తమన్ మాట్లాడుతూ.. OG సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. అన్ని రెడీ అయిపోయాయి. ఒక పాట శింబు గారు పాడారు. పవన్ గారు OG సినిమా షూటింగ్ కి వచ్చిన రోజు ఆ పాట రిలీజ్ చేస్తాము. ఆ పాట చాలా బాగా వచ్చింది. నా మ్యూజిక్ లో శింబు గారు ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ పవన్ గారికే పాడారు అని తెలిపాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు OG షూట్ కి వెళ్తాడా, ఎప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ వినాలా అని ఎదురుచూస్తున్నారు.
Also Read : Thaman – Game Changer : 140 కోట్ల లాస్.. ‘గేమ్ ఛేంజర్’ పై కావాలని చేసారు.. తమన్ వ్యాఖ్యలు వైరల్..