RGV : ఆర్జీవీ సిండికేట్ సినిమాలో ఆ స్టార్ హీరో.. ఇలాంటి టైంలో ఆ హీరో ఆర్జీవీతో సినిమా చేస్తాడా?
కానీ ఆర్జీవీ సిండికేట్ అనే సినిమా అనౌన్స్ చేసి, అది తన పాత సినిమాల్లా ఉంటుంది, అందర్నీ మెప్పిస్తుంది అని చెప్పుకొచ్చాడు.

RGV Syndicate Movie Tollywood star will be Main Lead along with Amitabh Bachchan and Fahadh Faasil
RGV : ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, మంచి సినిమాలు తీసి ఎంతోమందికి ప్రేరణగా నిలిచిన ఆర్జీవీ గత కొంతకాలంగా మాత్రం తన ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు. దీంతో ఆర్జీవిని పట్టించుకోవడం మానేశారు. మన తెలుగు స్టార్స్ అయితే అసలు ఆర్జీవీ వైపే వెళ్లడం మానేశారు. కానీ ఇటీవల సత్య సినిమా రీ రిలీజ్ చూసి ఆర్జీవీ ఎమోషనల్ గా నేను మారిపోయాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, పనికిమాలిన సినిమాలు చేశాను, ఇకపై మంచి సినిమాలు చేస్తాను అంటూ ట్వీట్ చేసాడు.
ఆర్జీవీ ఇలాంటి మాటలు ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు అని సినిమా లవర్స్ కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఆర్జీవీ సిండికేట్ అనే సినిమా అనౌన్స్ చేసి, అది తన పాత సినిమాల్లా ఉంటుంది, అందర్నీ మెప్పిస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా గురించి పదే పదే చెప్తూ మళ్ళీ పాత ఆర్జీవిని చూపిస్తా అంటున్నాడు. సందీప్ రెడ్డి వంగకు కూడా సిండికేట్ తో నేనెంతో చూపిస్తా అని చెప్పాడు. రెగ్యులర్ గా ఈ సినిమా గురించి మాట్లాడటంతో కొంతమంది నిజంగానే ఆర్జీవీ కంబ్యాక్ ఇస్తాడేమో అని ఎదురుచూస్తున్నారు.
Also Read : SS Thaman : ఇదేం ట్యాలెంట్ బ్రో.. పైలెట్స్ నన్ను మోసం చేయలేరు.. ఆసక్తికర విషయం చెప్పిన తమన్..
అయితే ఆర్జీవీ డేట్స్ అడిగితే టాలీవుడ్ హీరోలు ఎవ్వరూ ఇవ్వరు. కానీ తాజాగా ఓ రూమర్ వినిపిస్తుంది. ఆర్జీవీ వెంకటేష్ ని కలిసి సిండికేట్ కథ చెప్పి ఆ సినిమాకు డేట్స్ కావాలని అడిగాడట. వెంకటేష్ అయితే ప్రస్తుతానికి ఏ క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. సిండికేట్ లో కొత్తవాళ్లను, ముంబై వాళ్ళను తీసుకొని వెంకటేష్ మెయిన్ లీడ్ గా తెద్దాం అనుకుంటున్నాడట ఆర్జీవీ.
అయితే వెంకటేష్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తూ ఫామ్ లో ఉన్న వెంకిమామ ఆర్జీవీ సీరియస్ సినిమా సిండికేట్ కి ఒప్పుకోవడం కష్టమే అంటున్నారు టాలీవుడ్ జనాలు. గతంలో ఆర్జీవీ దర్శకత్వంలో వెంకటేష్ క్షణం క్షణం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వకపోయినా బోలెడన్ని అవార్డులు గెలుచుకొని క్లాసిక్ గా మిగిలింది.
Also Read : OG Song : పవన్ OG ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన తమన్.. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో కూడా చెప్పి..
మరి వెంకటేష్ ఆర్జీవీ సిండికేట్ సినిమాని ఒప్పుకుంటాడా లేక ఇది రూమర్ మాత్రమేనా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. వెంకటేష్ కాదంటే ఆర్జీవీ క్లోజ్ ఫ్రెండ్ నాగార్జునతో ఏమైనా ట్రై చేస్తాడేమో చూడాలి. అలాగే ఈ సినిమాలో అమితాబ్ ని ఓ కీ రోల్ కి తీసుకుంటాడు అని, ఫహద్ ఫాజిల్ కూడా ఓ రోల్ చేస్తాడని సమాచారం. అమితాబ్ ఆర్జీవీ అడిగితే నో చెప్పడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ అలాంటిది. ఇక ఇటీవలే ఆర్జీవీ ఫహద్ ని కలిసాడు. దీంతో ఈ ఇద్దరు కచ్చితంగా సిండికేట్ సినిమాలో ఉంటారు అని వినిపిస్తుంది.