Pooja Hegde : పూజ హెగ్డే తాతయ్య నేషనల్ లెవల్ అథ్లెట్ అని తెలుసా? ఆ రికార్డు కూడా పూజ తాతయ్య పేరు మీదే..
ఈ క్రమంలో పూజ హెగ్డే తన తాతయ్య గురించి తెలిపింది.

Do You Know about Pooja Hegde Grand Father he is a National Level Athlete
Pooja Hegde : తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజ హెగ్డే గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమాలు చెయ్యట్లేదు. తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. సూర్య సరసన పూజ నటించిన రెట్రో సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుండటంతో తాజాగా పూజ హెగ్డే తెలుగులో పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.
చాన్నాళ్ల తర్వాత తెలుగులో పూజ హెగ్డే ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో పూజ హెగ్డే తన తాతయ్య గురించి తెలిపింది. పూజ హెగ్డే మాట్లాడుతూ.. మా తాతయ్య స్పోర్ట్స్ పర్సన్, రన్నర్, నేషనల్ లెవల్ లో అని తెలిపింది. దీంతో పూజ హెగ్డే తాతయ్య ఎవరా అని వెతుకుతున్నారు నెటిజన్లు.
Also See : Actress Divi : పోలీస్ డ్రెస్ లో ‘దివి’.. జాట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నటి..
పూజ హెగ్డే తాతయ్య పేరు RH శెట్టి. పూజ తల్లి లతా హెగ్డేకి తండ్రి ఆయన. కర్ణాటక నుంచి స్టేట్ లెవల్లో అథ్లెటిక్స్ లో పాల్గొన్నారు. కర్ణాటక స్టేట్ రికార్డ్ 50 కిలోమీటర్ల నడక 15 ఏళ్ళు చెక్కు చెదరకుండా RH శెట్టి పేరు మీదే ఉంది. ఆ తర్వాత నేషనల్ లెవల్లో కూడా పలు ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఇండో – పాక్ గేమ్స్ లో పాల్గొని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు కూడా తీసుకున్నారు.
స్పోర్ట్స్ కెరీర్ కి రిటైర్ ఇచ్చాక నేషనల్ లెవల్లో పలు అథ్లెటిక్స్ ఆర్గనైజేషన్స్ లో వివిధ స్థానాల్లో పనిచేసారు. 1982 లో ఢిల్లీలో జరిగిన ఆసియన్ గేమ్స్ లో అథ్లెటిక్స్ లో చీఫ్ జడ్జ్ గా కూడా వ్యవహరించారు. అనంతరం ఆయన కొన్నాళ్ళు LIC లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. 2012లో ఆయన చనిపోయారు. RH శెట్టి చనిపోయినప్పుడు పూజ హెగ్డే తన సోషల్ మీడియాలో.. దేశం ఒక గొప్ప క్రీడాకారుడ్ని కోల్పోయింది అని పోస్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి తన తాతయ్యని గుర్తుచేసుకుంది పూజ.
Also Read : Thaman : మరీ ఇంత కాఫీ పిచ్చి ఏంటి భయ్యా..? ప్రపంచంలో ఉండే అన్ని కాఫీ బీన్స్.. 15 కాఫీ మిషన్స్..